News November 25, 2024

ఢిల్లీకి ఎందుకు పోతున్నవో.. ఎవరికి తెలుసు: కేటీఆర్

image

TG: నిధుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నానన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘పెళ్లికి పోతున్నవో, సావుకు పోతున్నవో.. ఎవరికి తెలుసు. 28 సార్లు ఢిల్లీ వెళ్లి రూ.28 కూడా తీసుకురాలేదు. బడే బాయ్, చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు?. మేం నీలాగా ఢిల్లీ గులాములం కాదు. పోరాటం మా రక్తంలోనే ఉంది. మా జెండా, ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధే’ అని ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News January 19, 2026

వరంగల్ పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా పొంగులేటి

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జిలను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భూపాలపల్లి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

News January 19, 2026

గిగ్ వర్కర్లకు గుడ్‌న్యూస్.. గ్యారంటీ లేకుండా ₹10 వేల లోన్!

image

డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్ల వంటి గిగ్ వర్కర్లు, డొమెస్టిక్ హెల్పర్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ లోన్ స్కీమ్‌ను తెచ్చే యోచనలో ఉంది. PM-SVANidhi తరహాలో ఏప్రిల్ 2026 నుంచి వీరికి ₹10,000 వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా లోన్లు అందించే అవకాశం ఉంది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదై యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. సకాలంలో చెల్లిస్తే ₹50,000 వరకు మళ్లీ లోన్ పొందే అవకాశం ఉంటుంది.

News January 19, 2026

రికార్డు స్థాయిలో పడిపోయిన చైనా జనాభా

image

చైనాలో వరుసగా నాలుగో ఏడాదీ జనాభా క్షీణించింది. 2025లో 33.9 లక్షలు తగ్గి 140.5 కోట్లకు చేరింది. జననాల రేటు 5.63గా నమోదై రికార్డుస్థాయికి పడిపోయింది. మరణాల రేటు మాత్రం 8.04తో 1968 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది. యువత పెళ్లిళ్లపై విముఖత చూపడం, పెరిగిన జీవనవ్యయం వల్ల దంపతులు పిల్లలు వద్దనుకోవడం ఇందుకు కారణాలు. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా, ‘ముగ్గురు పిల్లల’ విధానం తెచ్చినా మార్పు రాలేదు.