News November 25, 2024
పెన్షన్లపై గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
AP: డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లను ఒకరోజు ముందుగానే ప్రభుత్వం పంపిణీ చేయనుంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీనే పెన్షన్ డబ్బును పంపిణీ చేయాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించింది. 30వ తేదీన పెన్షన్ పంపిణీ పూర్తవకపోతే డిసెంబర్ 1న లేదా 2న పూర్తి చేయనున్నారు. కాగా వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రభుత్వం రూ.4000 పెన్షన్ ఇస్తోంది.
Similar News
News November 25, 2024
మరోసారి పడిక్కల్‌ను దక్కించుకున్న RCB
అన్‌సోల్డ్‌గా మిగిలిన ఆటగాళ్లు ఇవాళ మరోసారి వేలంలోకి వచ్చారు. దీంతో పడిక్కల్‌ను RCB రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో ఇతడు ఆ జట్టు తరఫున ఆడారు. ఇక KKR రహానేను రూ.1.50 కోట్లకు, మోయిన్ అలీని రూ.2 కోట్లకు, ఉమ్రాన్ మాలిక్‌ను రూ.75లక్షలకు సొంతం చేసుకుంది. గ్లెన్ ఫిలిప్స్‌ను రూ.2 కోట్లకు గుజరాత్ దక్కించుకుంది.
News November 25, 2024
అయ్యప్ప భక్తుల కోసం 62 స్పెషల్ రైళ్లు
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం SCR 62 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖ-కొల్లం, శ్రీకాకుళం రోడ్-కొల్లం, కాచిగూడ-కొట్టాయం, హైదరాబాద్-కొట్టాయం మధ్య ఈ 62 రైళ్లు తిరగనున్నాయి. ఈ రైళ్ల షెడ్యూల్, హాల్టింగ్స్, ప్రయాణించే తేదీల వివరాలను పైనున్న ఫొటోలో చూడవచ్చు.
News November 25, 2024
PPP పద్ధతిలో 18 స్టేట్ హైవేలు
APలోని 18 స్టేట్ హైవేలకు చెందిన 1307కి.మీ మేర రోడ్లను పీపీపీ(పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పద్ధతిలో నిర్మించనున్నారు. ప్రైవేట్ సంస్థలు రోడ్లను అభివృద్ధి చేసి, టోల్ వసూలు చేస్తాయి. బైకులు, ఆటోలు, ట్రాక్టర్లతో పాటు ఇంకా ఎవరికి మినహాయింపు ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం చర్చిస్తోంది. ప్రజలపై భారం లేకుండా కేవలం భారీ, ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు మాత్రమే టోల్ ఉండటాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.