News November 25, 2024

మైక్ వాల్ట్జ్ వ్యాఖ్యల్ని స్వాగతించిన రష్యా!

image

ప్ర‌స్తుత US ప్ర‌భుత్వం ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని తీవ్రం చేస్తుంటే, అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన ట్రంప్ స‌ర్కిల్ శాంతి ప్ర‌ణాళికపై మాట్లాడుతోందని రష్యా పేర్కొంది. US జాతీయ భద్రతా సలహాదారుగా ఎంపికైన‌ మైక్ వాల్ట్జ్ ఇటీవల స్పందిస్తూ యుద్ధంపై ట్రంప్ ఆందోళ‌న‌గా ఉన్నార‌ని, దీనికి ముగింపు ప‌ల‌కాల‌న్నారు. రష్యా స్పందిస్తూ కొన్నిషరతులతో ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ గతంలోనే చెప్పారంది.

Similar News

News January 22, 2026

అభిషేక్… రికార్డులు షేక్

image

న్యూజిలాండ్‌తో తొలి T20లో అభిషేక్ శర్మ రికార్డ్ సృష్టించారు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు, 25 లేదా అంతకంటే తక్కువ బాల్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(8) చేసిన బ్యాటర్‌గా నిలిచారు. గతంలో సూర్య, సాల్ట్, లూయిస్‌తో(7 సార్లు) సంయుక్తంగా ఉన్న అభిషేక్ ఇవాళ వారిని అధిగమించారు. NZపై ఓ భారత్ బ్యాటర్ అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేయడంలోనూ ఘనత వహించారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో 50 కొట్టారు.

News January 22, 2026

అడిషనల్ కలెక్టర్ ఆస్తులు రూ.వందల కోట్లు

image

TG: గతనెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ACB ఇవాళ రైడ్స్ చేసింది. సోదాల్లో రూ.4.65Cr విలువైన విల్లా, ఒక ఫ్లాట్, 8 ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి పేపర్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. రూ.30లక్షల నగదు, 297 గ్రా. బంగారం, రూ.44.04 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

News January 22, 2026

భారత్ ఘన విజయం

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో 48 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో NZ తడబడింది. ఫిలిప్స్(78), చాప్‌మన్(39) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. IND బౌలర్లలో చక్రవర్తి, దూబె చెరో 2, అక్షర్, అర్ష్‌దీప్, హార్దిక్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్‌లో అభిషేక్(84), రింకూ సింగ్(44), సూర్యకుమార్(32) రాణించారు.