News November 25, 2024

‘కలుషిత ఆహారం’ బాధితురాలు శైలజ మృతి

image

TG: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ(16) మృతి చెందింది. సెప్టెంబర్ 30న కుమ్రంభీం జిల్లా వాంకిడి పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమంలోనే శైలజను చికిత్స కోసం నిమ్స్‌లో చేర్చారు. ఇటీవల ఆమెను రాష్ట్ర మంత్రులు, BRS నేతలు పరామర్శించారు. అయితే పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే శైలజ తనువు చాలించింది.

Similar News

News November 26, 2024

ముగిసిన IPL మెగా వేలం

image

IPL-2025 మెగా వేలం ముగిసింది. నిన్న, ఈరోజు జరిగిన ఆక్షన్‌లో ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రూ.వందల కోట్లు చెల్లించి కొనుగోలు చేశాయి. అత్యధికంగా రిషభ్ పంత్‌‌ను లక్నో రూ.27 కోట్లకు, శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్‌ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకున్నాయి. IPL చరిత్రలో అత్యంత చిన్న వయస్కుడైన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. IPL-2025 సీజన్ వచ్చే ఏడాది మార్చి 14న ప్రారంభం కానుంది.

News November 26, 2024

మళ్లీ వేలంలోకి అర్జున్ టెండూల్కర్.. ఎవరు కొన్నారంటే?

image

IPL-2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన సచిన్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ను నిర్వాహకులు మరోసారి వేలంలోకి తెచ్చారు. ఈసారి అతడిని ముంబై ఇండియన్స్ బేస్ ప్రైస్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలోనూ అర్జున్‌ను MI దక్కించుకుంది. లిజాద్ విలియమ్స్‌ను కూడా MI రూ.75లక్షలకు సొంతం చేసుకుంది.

News November 26, 2024

‘ఫస్ట్ నైట్ ఎఫెక్ట్’ అంటే ఏంటో తెలుసా?

image

కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు నిద్ర పట్టిందా? అని అడుగుతారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? తెలియని పరిసరాలలో నిద్రిస్తున్నప్పుడు, మనిషి మెదడులో సగం మాత్రమే విశ్రాంతి పొందుతుందని బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. ‘కుడివైపు కంటే ఎడమవైపు ఎక్కువ మేల్కొని ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే కొత్త ప్రదేశంలో నిద్రించిన తర్వాత కొందరు అలసిపోతారు. దీనిని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటారు’ అని పరిశోధకులు తెలిపారు.