News November 25, 2024
ఉద్యోగం నుంచి తొలగించినందుకు పరిహారం చెల్లించాలన్న కోర్టు!

చైనాకు చెందిన ఓ కెమికల్ కంపెనీలో పనిచేసే జాంగ్ అనే ఉద్యోగి ఆఫీసులో పడుకున్నాడని యాజమాన్యం అతణ్ని తొలగించింది. దీంతో అతను కోర్టును ఆశ్రయించారు. అతను 20 ఏళ్లుగా మంచి పనితీరు కనబరిచారని, ముందు రోజు ఆఫీసులో లేట్ అవడంతో పడుకున్నట్లు కోర్టు గుర్తించింది. ఈక్రమంలో అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు జాంగ్‌కు కంపెనీ 3,50,000 యువాన్‌లు(రూ.40.7 లక్షలు) పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
Similar News
News July 6, 2025
‘లక్కీ భాస్కర్’కు సీక్వెల్ ఉంది: డైరెక్టర్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ధనుష్‌తో తాను తీసిన ‘సార్’ సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని తెలిపారు. గత ఏడాది OCTలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ ₹100crకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం వెంకీ తమిళ హీరో సూర్యతో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు.
News July 6, 2025
ప్రేమజంట ఆత్మహత్య!

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
జులై 13 నుంచి వెబ్ ఆప్షన్లు

AP: EAPCET, ఫార్మసీ కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదును ఈ నెల 13 నుంచి నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి జరగాల్సి ఉండగా, 13వ తేదీకి మార్చారు. ఇంజినీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు రావడానికి ఆలస్యం కారణంగానే వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.