News November 25, 2024
అన్‌సోల్డ్‌గా మిగిలిన విదేశీ ఆటగాళ్లు వీరే
ఐపీఎల్ మెగా వేలంలో విదేశీ ప్లేయర్లు బెన్ డకెట్, డెవాల్డ్ బ్రెవిస్, మొయిన్ అలీ, ఫిన్ అలెన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. విల్ జాక్స్‌ను ముంబై ఇండియన్స్ రూ.5.25 కోట్లు చెల్లించి కైవసం చేసుకుంది. టిమ్ డేవిడ్‌ను ఆర్సీబీ రూ.3 కోట్లతో సొంతం చేసుకుంది. షాబాజ్ అహ్మద్‌ను రూ.2.40 కోట్లకు LSG దక్కించుకుంది. దీపక్ హుడాను రూ.1.70 కోట్లు చెల్లించి సీఎస్కే తీసుకుంది.
Similar News
News November 26, 2024
మళ్లీ వేలంలోకి అర్జున్ టెండూల్కర్.. ఎవరు కొన్నారంటే?
IPL-2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను నిర్వాహకులు మరోసారి వేలంలోకి తెచ్చారు. ఈసారి అతడిని ముంబై ఇండియన్స్ బేస్ ప్రైస్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలోనూ అర్జున్‌ను MI దక్కించుకుంది. లిజాద్ విలియమ్స్‌ను కూడా MI రూ.75లక్షలకు సొంతం చేసుకుంది.
News November 26, 2024
‘ఫస్ట్ నైట్ ఎఫెక్ట్’ అంటే ఏంటో తెలుసా?
కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు నిద్ర పట్టిందా? అని అడుగుతారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? తెలియని పరిసరాలలో నిద్రిస్తున్నప్పుడు, మనిషి మెదడులో సగం మాత్రమే విశ్రాంతి పొందుతుందని బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. ‘కుడివైపు కంటే ఎడమవైపు ఎక్కువ మేల్కొని ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే కొత్త ప్రదేశంలో నిద్రించిన తర్వాత కొందరు అలసిపోతారు. దీనిని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటారు’ అని పరిశోధకులు తెలిపారు.
News November 26, 2024
KKR కంప్లీట్ స్క్వాడ్ ఇదే
ఐపీఎల్ రిటెన్షన్స్, మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 21 మందిని కొనుగోలు చేసింది. జట్టు: రింకూ సింగ్, సునీల్ నరైన్, వరుణ్, రస్సెల్, హర్షిత్ రాణా, రహానే, రమణ్‌దీప్, వెంకటేశ్ అయ్యర్, డికాక్, గుర్బాజ్, నోకియా, పావెల్, మనీశ్ పాండే, స్పెన్సర్ జాన్సెన్, సిసోడియా, అనుకూల్ రాయ్, మొయిన్ అలీ, లవ్‌నిత్, రఘువంశీ, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్.