News November 25, 2024

CM చంద్రబాబుకు షర్మిల లేఖ

image

AP: CM చంద్రబాబుకు PCC చీఫ్ షర్మిల లేఖ రాశారు. అదానీతో జగన్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందం APకి పెనుభారమని లేఖలో ఆమె పేర్కొన్నారు. అక్రమ డీల్ వల్ల పాతికేళ్ల పాటు ప్రజలపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుందని ఆమె ఆరోపించారు. అర్ధరాత్రి అనుమతులు ఎందుకు ఇచ్చారనే దానిపై దర్యాప్తు జరగాలని, ఈ ఒప్పందాలపై CBI లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరారు.

Similar News

News February 4, 2026

‘వారణాసి’ మూవీకి నెట్‌ఫ్లిక్స్ రూ.650 కోట్ల ఆఫర్?

image

SS రాజమౌళి, మహేశ్ బాబుల క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.650 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఓటీటీ డీల్ అవుతుంది. థియేట్రికల్ రన్‌ను కాపాడేందుకు సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే OTTలో స్ట్రీమింగ్ అయ్యేలా మేకర్స్ ఒప్పందం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.

News February 4, 2026

అనిల్ అగర్వాల్ దాతృత్వం.. 75% సంపద దానం!

image

వేదాంతా గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తన మొత్తం ఆస్తిలో 75% సమాజానికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. సుమారు $4.9B నికర విలువ కలిగిన ఆయన ప్రమోటర్ హోదా నుంచి వైదొలగి ఇకపై ట్రస్టీగా సేవలు అందించనున్నారు. ఇటీవల మరణించిన తన కుమారుడు అగ్నివేశ్ జ్ఞాపకార్థం విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ₹15 వేల కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం తన నిర్ణయాన్ని ఆయన అధికారికంగా వెల్లడించారు.

News February 4, 2026

$852 బిలియన్లకు మస్క్ సంపద

image

స్పేస్‌ఎక్స్, xAI విలీనంతో ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ఫోర్బ్స్ ప్రకారం.. ఈ డీల్ తర్వాత ఆయన నెట్ వర్త్ $852 బిలియన్లకు చేరింది. దీంతో ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఆయన నిలిచారు. విలీనం తర్వాత ఏర్పడిన కొత్త సంస్థ విలువ $1.25 ట్రిలియన్లుగా ఉండగా ఈ ఒక్క ఒప్పందం వల్లే మస్క్ సంపదకు అదనంగా $84 బిలియన్లు తోడయ్యాయి. మస్క్ తర్వాత లారీ పేజ్ $278 బిలియన్లతో రెండో స్థానంలో ఉన్నారు.