News November 25, 2024

సెన్సెక్స్‌, నిఫ్టీలో అక్క‌డ Strong Resistance

image

స్టాక్ మార్కెట్లు సోమ‌వారం భారీ లాభాలను ఆర్జించినా Day Highని అధిగమించలేదు. సెన్సెక్స్‌లో 80,470 వ‌ద్ద‌, నిఫ్టీలో 24,350 వ‌ద్ద ఉన్న Strong Resistance వ‌ల్ల సూచీలు Consolidation Zoneలోనే ప‌య‌నించాయి. ఉద‌యం 2 సూచీల్లో Pre-Open Marketలో భారీగా బిజినెస్ జరిగింది. ఆ లాభాలు మిన‌హా ఈరోజు ప్ర‌త్యేకించి సూచీలు సాధించింది ఏమీ లేదనే చెప్పాలి. ఉదయం ట్రేడింగ్ Open అయిన స్థాయిలోనే చివరికి Close అయ్యాయి.

Similar News

News January 21, 2026

మే నెలలో సముద్రంలోకి మత్స్య-6000

image

సముద్ర గర్భ రహస్యాల అన్వేషణలో భారత్ కీలక అడుగు వేయబోతుంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా చెన్నై NIOT కేంద్రంలో తయారైన నాలుగో తరం సబ్‌మెరైన్ ‘మత్స్య-6000’ను మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. డీప్ ఓషియన్ మిషన్ (DOM) కింద రూపొందిన ఈ సబ్‌మెరైన్‌లో 500 మీటర్ల లోతు వరకు ముగ్గురు ఆక్వానాట్స్ ప్రయాణిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే US, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సరసన భారత్ నిలుస్తుంది.

News January 21, 2026

ముంబైపై ఢిల్లీ ఘన విజయం

image

WPL: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(51*), లీ(46) చెలరేగడంతో 155 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అమన్‌జోత్ కౌర్, వైష్ణవికి చెరో వికెట్ దక్కింది. ముంబై బ్యాటర్లలో బ్రంట్(65), హర్మన్ ప్రీత్(41) మాత్రమే రాణించారు.

News January 21, 2026

JAN 25 లేదా 26న ఎన్నికల నోటిఫికేషన్: మంత్రి వివేక్

image

TG: ఈ నెల 25 లేదా 26న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మెదక్(D) నర్సాపూర్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. మరోవైపు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్ఈసీ రాణికుముదిని ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.