News November 25, 2024

ఇలాంటి జింకలను మీరెప్పుడైనా చూశారా?

image

జింకల్లో ఎన్నో రకాలున్నాయి. అందులో సైగ జింక అరుదైనది. ఇది కాస్త విచిత్రమైన రూపాన్ని కలిగి ఉంటుంది. మధ్య ఆసియాలోని గడ్డి భూముల్లో కనిపించే సైగ జింకలకు విచిత్రమైన, ఉబ్బెత్తు ముక్కు ఉంటుంది. కాలానుగుణ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను భరించడంలో ఈ ముక్కు సహాయపడుతుంది. నాసికా రంధ్రాలు గాలి ఫిల్టర్‌లుగా పనిచేస్తాయి. చల్లటి గాలిని పీల్చుకుని ఊపిరితిత్తులకు చేరేలోపు వేడి చేస్తాయి.

Similar News

News January 29, 2026

మణిద్వీపం గురించి మీకు తెలుసా?

image

జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి నివసించే ప్రదేశమే మణిద్వీపం. ఇది భౌతిక ప్రపంచానికి అతీతంగా వైకుంఠం, కైలాసం కంటే ఉన్నతమైనదని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు ఇక్కడ చింతామణి గృహంలో కొలువై ఉండి విశ్వాన్ని పాలిస్తుంటారు. మణిద్వీపం అంటే అమ్మవారు కాదు. అది ఆమె నివాసం ఉండే ద్వీపం. ఇక్కడ అనంత సంపదలు, రత్నాలు, పారిజాత వనాలు ఉంటాయి. మణిదీప వర్ణన చదివితే దారిద్య్రం తొలగి, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.

News January 29, 2026

రబీ జొన్న పంటలో ఎదుగుదల లోపించిందా?

image

పెరిగిన చలి తీవ్రత కారణంగా రబీలో నాటిన జొన్న పంట ఎదుగుదల కొన్నిచోట్ల లోపించినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి లీటరు నీటికి 19-19-19 మిశ్రమాన్ని 5 గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అలాగే జొన్న పంటలో ఒకవేళ కత్తెర పురుగును గుర్తిస్తే లీటరు నీటికి క్లోరాంట్రానిప్రోల్ 0.4ml లేదా స్పైనటోరమ్ 0.5ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 29, 2026

మిషన్ కాకతీయ చెరువుల నిర్వహణకు నిధులు

image

TG: BRS హయాంలో పునరుద్ధరించిన ‘మిషన్ కాకతీయ’ చెరువుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది.గత ప్రభుత్వం సుమారు 40,000 చెరువులను పునరుద్ధరించింది. కొన్నేళ్లుగా వర్షాలు ఎక్కువగా కురవడంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. భారీ నీటి నిల్వలతో వాటి పరిరక్షణ సవాలుగా మారింది. నిర్వహణ పనుల కోసం ₹50 కోట్లు అవసరమవుతాయని ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వం ₹5 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది.