News November 25, 2024
ఇది కదా విజయం అంటే..!
లక్ష్య ఛేదనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగితే ఫలితం దక్కుతుందన్న మాటలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిరూపించారు. ‘2004లో గోవాలో IFFIల ఈవెంట్ మేనేజ్మెంట్లో నాగ్ పనిచేశారు. సరిగ్గా 20 ఏళ్లకు IFFI పుస్తకంలో ఆయనకు ఓ పేజీ కేటాయించారు. ఈ విషయాన్ని ఆయన ఇన్స్టాలో పంచుకున్నారు. కాగా ‘మహానటి’తో నేషనల్ అవార్డు అందుకున్న ఆయన ‘కల్కి’తో రూ.వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించిన డైరెక్టర్గా చరిత్రలోకెక్కారు.
Similar News
News November 26, 2024
ప్రేమ కథలు చేయొద్దని నిర్ణయించుకున్నా: సిద్ధార్థ్
తన జీవితంలో అదితి రావు హైదరీ రూపంలో దేవత వచ్చిందని హీరో సిద్ధార్థ్ అన్నారు. తానిప్పుడు తెలంగాణ అల్లుడిగా ఇక్కడికి వచ్చానని ‘మిస్ యూ’ మూవీ ప్రమోషన్లో మీడియాతో చెప్పారు. 2024 తనకు జరిగిన మంచి పెళ్లి అని సంతోషం వ్యక్తం చేశారు. స్టార్ అవడం తన డ్రీమ్ కాదని, ఒక మంచి నటుడు అనిపించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రేమ కథలు చేయొద్దని కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
News November 26, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: నవంబర్ 26, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5:11 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:27 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:03 గంటలకు
అసర్: సాయంత్రం 4:04 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.56 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 26, 2024
సంజూ శాంసన్ సేన ఇదే
IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంతో కలిపి రాజస్థాన్ రాయల్స్ 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. జట్టు: సంజూ శాంసన్, యశస్వీ జైస్వాల్, పరాగ్, జురేల్, హెట్మయర్, సందీప్ శర్మ, ఆర్చర్, తీక్షణ, హసరంగ, ఆకాశ్ మధ్వాల్, కుమార్ కార్తికేయ, నితీశ్ రాణా, తుషార్ దేశ్పాండే, శుభమ్ దూబే, యుధ్విర్ సింగ్, ఫరూఖీ, సూర్యవంశీ, మఫాకా, రాథోడ్, అశోక్ శర్మ