News November 25, 2024

అయ్యప్ప భక్తుల కోసం 62 స్పెషల్ రైళ్లు

image

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం SCR 62 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. విశాఖ-కొల్లం, శ్రీకాకుళం రోడ్-కొల్లం, కాచిగూడ-కొట్టాయం, హైదరాబాద్-కొట్టాయం మధ్య ఈ 62 రైళ్లు తిరగనున్నాయి. ఈ రైళ్ల షెడ్యూల్, హాల్టింగ్స్, ప్రయాణించే తేదీల వివరాలను పైనున్న ఫొటోలో చూడవచ్చు.

Similar News

News January 25, 2026

ఛీటింగ్ ఆరోపణలు.. రూ.10 కోట్ల దావా వేసిన పలాష్ ముచ్చల్

image

₹40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, అమ్మాయితో మంచంపై <<18940645>>అడ్డంగా దొరికాడని<<>> తనపై వస్తున్న ఆరోపణలపై పలాష్ ముచ్చల్ కోర్టుకెక్కారు. ₹10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు అబద్ధాలని స్పష్టం చేశారు. ‘నా పరువు, వ్యక్తిత్వాన్ని కించపరచాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నా లాయర్ ద్వారా విజ్ఞాన్ మానేకు లీగల్ నోటీసు పంపాను’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

News January 25, 2026

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

image

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<>HCL<<>>) 3 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MSc(జియోలజీ, అప్లైడ్ జియోలజీ) అర్హతో పాటు పని అనుభవం గల వారు ఫిబ్రవరి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.65వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://hindustancopper.com

News January 25, 2026

ఫిల్మ్ ఇండస్ట్రీలో మత పక్షపాతం లేదు: అరుణ్ గోవిల్

image

ఫిల్మ్ ఇండస్ట్రీలో మత పక్షపాతం లేదని ‘రామాయణ’ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్ అన్నారు. ఒకవేళ అది ఉండుంటే సల్మాన్, షారుఖ్, ఆమీర్ లాంటి ముస్లిం యాక్టర్లు స్టార్లు అయ్యేవారు కాదని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. తనకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని, దీనికి మతం కూడా కారణం కావొచ్చని మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల పేర్కొనడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ గోవిల్ స్పందించారు.