News November 25, 2024

ఈ ఏడాది ఎక్కువగా వెతికిన పదం ఇదే!

image

సరైన మీనింగ్ తెలియని, కొత్త పదం గురించి తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. అలా ‘Manifest’ అనే పదాన్ని 2024లో అత్యధికంగా శోధించారని ‘కేంబ్రిడ్జ్’ డిక్షనరీ ప్రకటించింది. ఈ ఏడాదిలో 1.30 లక్షల పేజీ వీక్షణలతో Manifest అగ్రస్థానంలో నిలిచింది. మ్యానిఫెస్ట్ అంటే విజువలైజేషన్ & అఫర్మేషన్. మరి ఈ ఏడాది మీరు ఎక్కువగా ఏ వర్డ్‌ను సెర్చ్ చేశారో కామెంట్ చేయండి.

Similar News

News November 26, 2024

IPL: మెగావేలంలో ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేశాయంటే?

image

ఐపీఎల్ మెగావేలంలో 10 ఫ్రాంచైజీలు రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 182 మంది ప్లేయర్లు వేలంలో అమ్ముడుపోగా వీరిలో 62 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం 8 మంది ఆటగాళ్లను RTM ద్వారా ఆయా జట్లు దక్కించుకున్నాయి. అత్యధికంగా పంజాబ్ 23 మంది ప్లేయర్లను కొనుగోలు చేయగా, అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ 14 మందిని వేలంలో దక్కించుకుంది. ఇంకా ఆర్సీబీ వద్ద అత్యధికంగా రూ.75 లక్షలు మిగిలి ఉన్నాయి.

News November 26, 2024

ఢిల్లీ వెళ్లింది అందుకే: ఫడణవీస్

image

ఆకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడంపై మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లానని, రాజకీయాల గురించి కాదని మీడియాతో చెప్పారు. మరోవైపు ఇవాళ ఆయన ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎంగా బాధ్యతలు ఎవరు చేపడుతారనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది.

News November 26, 2024

తిరుపతి జూలో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మృతి

image

AP: తిరుపతిలోని వెంకటేశ్వర జూపార్క్‌లో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మరణించింది. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మధు అనే పెద్దపులి ఆరోగ్య సమస్యలతో చనిపోయినట్లు సిబ్బంది తెలిపారు. గత రెండు నెలలుగా ఈ టైగర్ ఎలాంటి ఆహారం తీసుకోవట్లేదని పేర్కొన్నారు. అవయవాలు దెబ్బతినడం వల్లే పులి మరణించినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో వెంకటేశ్వర జూపార్కులో మూడు టైగర్స్ చనిపోవడం గమనార్హం.