News November 26, 2024
మినీ ఆస్ట్రేలియాగా మారిన పంజాబ్
IPL-2025 రిటెన్షన్స్, మెగా వేలంతో కలిపి పంజాబ్ కింగ్స్ 25 మందిని కొనుగోలు చేసింది. ఐదుగురు ఆసీస్ ప్లేయర్లను తీసుకుంది. జట్టు: శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, ఇంగ్లిస్, హార్డీ, బార్ట్లెట్, అర్ష్‌దీప్, ప్రభ్ సిమ్రన్, వినోద్, వైశాఖ్, వధేరా, యశ్ ఠాకూర్, బ్రార్, హర్నూర్, షెడ్గే, పైలా, చాహల్, ముషీర్ ఖాన్, ప్రియాన్ష్ ఆర్య, ఫెర్గుసన్, జాన్సెన్, సేన్, ప్రవీణ్ దూబే, ఒమర్జాయ్.
Similar News
News November 26, 2024
IPL: మెగావేలంలో ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేశాయంటే?
ఐపీఎల్ మెగావేలంలో 10 ఫ్రాంచైజీలు రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 182 మంది ప్లేయర్లు వేలంలో అమ్ముడుపోగా వీరిలో 62 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం 8 మంది ఆటగాళ్లను RTM ద్వారా ఆయా జట్లు దక్కించుకున్నాయి. అత్యధికంగా పంజాబ్ 23 మంది ప్లేయర్లను కొనుగోలు చేయగా, అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ 14 మందిని వేలంలో దక్కించుకుంది. ఇంకా ఆర్సీబీ వద్ద అత్యధికంగా రూ.75 లక్షలు మిగిలి ఉన్నాయి.
News November 26, 2024
ఢిల్లీ వెళ్లింది అందుకే: ఫడణవీస్
ఆకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడంపై మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లానని, రాజకీయాల గురించి కాదని మీడియాతో చెప్పారు. మరోవైపు ఇవాళ ఆయన ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎంగా బాధ్యతలు ఎవరు చేపడుతారనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశముంది.
News November 26, 2024
తిరుపతి జూలో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మృతి
AP: తిరుపతిలోని వెంకటేశ్వర జూపార్క్‌లో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మరణించింది. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మధు అనే పెద్దపులి ఆరోగ్య సమస్యలతో చనిపోయినట్లు సిబ్బంది తెలిపారు. గత రెండు నెలలుగా ఈ టైగర్ ఎలాంటి ఆహారం తీసుకోవట్లేదని పేర్కొన్నారు. అవయవాలు దెబ్బతినడం వల్లే పులి మరణించినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో వెంకటేశ్వర జూపార్కులో మూడు టైగర్స్ చనిపోవడం గమనార్హం.