News November 26, 2024
TODAY HEADLINES
✎ ప్రతిపక్షాలను ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారు: మోదీ
✎ అదానీ రూ.100 కోట్లు తెలంగాణకు వద్దు: CM రేవంత్
✎ జగన్-అదానీ ఒప్పందాన్ని రద్దు చేయాలని CBNకు షర్మిల లేఖ
✎ లగచర్లకు వెళ్లుంటే రేవంత్‌ను ఉరికించి కొట్టేవాళ్లు: KTR
✎ ఈనెల 30నే పింఛన్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
✎ పుష్ప-2ను ఆపడం ఎవరితరం కాదు: అంబటి
✎ ముగిసిన IPL-2025 మెగా వేలం
✎ BGT: తొలి టెస్టులో భారత్ 295 రన్స్ తేడాతో విజయం
Similar News
News November 26, 2024
కులగణన సర్వే 92.6 శాతం పూర్తి
TG: రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే 1,08,89,758 ఇండ్లలో(92.6 శాతం) పూర్తి అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 13 జిల్లాల్లో 100శాతం, 17 జిల్లాల్లో 90 శాతంపైగా, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 82.3% పూర్తయినట్లు పేర్కొంది. మరోవైపు ఆన్‌లైన్‌లో డేటా నమోదు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.
News November 26, 2024
వెంకటేశ్‌కు ‘సంక్రాంతి’ కలిసొస్తుందా?
విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. 2005లోనూ సంక్రాంతి సమయంలో ‘సంక్రాంతి’ మూవీతో వెంకీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టారు. దీంతో హిస్టరీ రిపీట్ అవుద్దని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి చిత్రాలు పండుగకు విడుదల కానున్నాయి.
News November 26, 2024
భయపెడుతున్న ‘బిర్యానీ’
హైదరాబాద్ అనగానే ఆహారప్రియులకు మొదట గుర్తొచ్చేది ‘బిర్యానీ’. ఇటీవల నగరంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు వారిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. బిర్యానీలో కుళ్లిన మాంసం, కీటకాలు, సిగరెట్ పీకలకు తోడు ఫుడ్ పాయిజన్ వంటివి కలవరపెడుతున్నాయి. దీంతో బయట తినాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పరిశుభ్రత పాటించని హోటల్స్‌పై ఫుడ్ సెఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.