News November 26, 2024
ఇవాళ, రేపు ప్రజా విజయోత్సవాలు: జిల్లా కలెక్టర్

ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తామని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో, ఎల్లుండి ఖమ్మం రూరల్ మద్ది ఎల్లారెడ్డి ఫంక్షన్ హాలులో జయ జయహే ప్రజా పాలన అనే కళాబృందం అలేఖ్య సారథ్యంలో కార్యక్రమం నిర్వహిస్తమని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
Similar News
News September 18, 2025
అంధుల పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక

ఖమ్మం జిల్లాలో అంధుల కోసం పాఠశాల నిర్మాణానికి పక్కా ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంధుల స్కూల్ ఏర్పాటుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ, జడ్పీ సీఈఓ, విద్యాశాఖ అధికారులతో చర్చించారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు.
News September 17, 2025
నిరంతర విద్యుత్ సరఫరాకు కృషి చేయాలి: Dy.CM

ఖమ్మం జిల్లా ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం పరేడ్ గ్రౌండ్‌లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులతో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.
News September 17, 2025
పేదల సంక్షేమమే ప్రజాపాలన ధ్యేయం: Dy.CM భట్టి

ఖమ్మం: రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రజాపాలన కొనసాగుతోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రైతాంగం, కూలీలు భూమి, భుక్తి కోసం చేసిన పోరాటాలు అమోఘమైనవని కొనియాడారు.