News November 26, 2024

కావ్యా మారన్ సంపద ఎంతో తెలుసా?

image

SRH సీఈవో కావ్యా మారన్‌ నెట్ వర్త్ రూ.409 కోట్లు అని ‘జన్ భారత్ టైమ్స్’ తెలిపింది. 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించిన కావ్య చిన్నవయసులోనే తన తండ్రికి చెందిన వ్యాపారాల్లో అడుగుపెట్టారు. కావ్య తండ్రి, SRH కో-ఓనర్ కళానిధి మారన్ దేశంలోని సంపన్నుల్లో ఒకరు. ఆయన నెట్ వర్త్ రూ.19వేల కోట్లు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కళానిధి మారన్‌దే. సన్ గ్రూప్‌కు ఆయనే ఛైర్మన్.

Similar News

News November 26, 2024

కులగణన సర్వే 92.6 శాతం పూర్తి

image

TG: రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే 1,08,89,758 ఇండ్లలో(92.6 శాతం) పూర్తి అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 13 జిల్లాల్లో 100శాతం, 17 జిల్లాల్లో 90 శాతంపైగా, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 82.3% పూర్తయినట్లు పేర్కొంది. మరోవైపు ఆన్‌లైన్‌లో డేటా నమోదు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.

News November 26, 2024

వెంకటేశ్‌కు ‘సంక్రాంతి’ కలిసొస్తుందా?

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. 2005లోనూ సంక్రాంతి సమయంలో ‘సంక్రాంతి’ మూవీతో వెంకీ బాక్సాఫీస్ వద్ద హిట్‌ కొట్టారు. దీంతో హిస్టరీ రిపీట్ అవుద్దని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి చిత్రాలు పండుగకు విడుదల కానున్నాయి.

News November 26, 2024

భయపెడుతున్న ‘బిర్యానీ’

image

హైదరాబాద్ అనగానే ఆహారప్రియులకు మొదట గుర్తొచ్చేది ‘బిర్యానీ’. ఇటీవల నగరంలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు వారిని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. బిర్యానీలో కుళ్లిన మాంసం, కీటకాలు, సిగరెట్ పీక‌లకు తోడు ఫుడ్ పాయిజన్ వంటివి కలవరపెడుతున్నాయి. దీంతో బయట తినాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పరిశుభ్రత పాటించని హోటల్స్‌పై ఫుడ్ సెఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.