News November 26, 2024
నల్గొండ: వియత్నాం అమ్మాయితో తెలుగు అబ్బాయి పెళ్లి

చండూరుకి చెందిన పాంపాటి భాస్కర్ శోభ దంపతుల మొదటి కుమారుడు ఉద్యోగరీత్యా 2017లో వియత్నం వెళ్లారు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ.. అక్కడే హోటల్స్ స్థాపించి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వంలో యూత్ మినిస్ట్రీ సెక్రటరీగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నీనా పరిచయం కావడం పరిచయం కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నారు. చండూరులో వారి పెళ్లి జరిగింది.
Similar News
News September 16, 2025
నల్గొండ: అంగన్వాడీ టీచర్ల పోరుబాట

సమస్యల సాధన కోసం అంగన్వాడీ టీచర్లు పోరుబాట పట్టారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగానే అంగన్వాడి టీచర్లు ఉన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.18 వేల వేతనంతో పాటు పీఎఫ్ అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 8న రాష్ట్ర సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రాల్లో పాదయాత్ర, 17 నుంచి ఆన్లైన్ సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.
News September 16, 2025
రేపు నల్గొండలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

నల్గొండలో పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ దినోత్సవాల సందర్భంగా ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
News September 16, 2025
NLG: అమ్మకానికి ‘దొడ్డు’ బియ్యం

నల్గొండ జిల్లాలో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం ఈ వేలం ద్వారా అమ్మకం చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,927 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం బియ్యాన్ని వేలం వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కిలోకు రూ.24 చొప్పున ఈ వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.