News November 26, 2024
కులగణన సర్వే 92.6 శాతం పూర్తి
TG: రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుల గణన సర్వే 1,08,89,758 ఇండ్లలో(92.6 శాతం) పూర్తి అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 13 జిల్లాల్లో 100శాతం, 17 జిల్లాల్లో 90 శాతంపైగా, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 82.3% పూర్తయినట్లు పేర్కొంది. మరోవైపు ఆన్‌లైన్‌లో డేటా నమోదు ప్రక్రియ కూడా ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.
Similar News
News November 26, 2024
పెరుగుతున్న చలి.. 3 రోజులు జాగ్రత్త!
TG: రాష్ట్రంలో రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉందని తెలిపింది. నిన్న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చాలా చోట్ల 10 డిగ్రీలు, HYD శివారులోని పటాన్ చెరు ప్రాంతంలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News November 26, 2024
ఎన్నికలకు ముందే చంద్రబాబుతో మాట్లాడా: బాలినేని
AP: మాజీ సీఎం జగన్‌తో రాజకీయ ప్రయాణం వల్ల తన ఆస్తిని మొత్తం అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే వైసీపీని వీడుదామనుకున్నానని, ఈ విషయంపై చంద్రబాబుతో కూడా మాట్లాడానని తెలిపారు. ఆయన టీడీపీలోకి ఆహ్వానించి, మంత్రి పదవి ఆఫర్ చేశారని చెప్పారు. అయితే అప్పుడు తన రాత బాగోలేక పార్టీ వీడలేదని పేర్కొన్నారు.
News November 26, 2024
మూడేళ్లలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర నిధులివే
వివిధ పద్దుల కింద FY22-24 మధ్య మూడేళ్లలో ఏపీకి రూ.1.48 లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్రం పార్లమెంట్‌లో వెల్లడించింది. తెలంగాణకు రూ.1.22 లక్షల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపింది. అలాగే నవభారత సాక్షరత కార్యక్రమం(ఉల్లాస్) కింద ఏపీలో 30.70 లక్షల మంది నమోదైతే తెలంగాణలో ఆ సంఖ్య 75 మాత్రమేనని కేంద్ర మంత్రి జయంత్ చౌధరి చెప్పారు.