News November 26, 2024

RGV ఎక్కడ?

image

సోషల్ మీడియాలో పోస్టుల కేసులో RGV పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఆయనను విచారించేందుకు ఒంగోలు పోలీసులు HYD వచ్చారు. RGV ఇంట్లో లేరని సిబ్బంది వారిని అడ్డుకోవడంతో చాలాసేపు హైడ్రామా నడిచింది. వర్మ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన HYD లేదా కోయంబత్తూరులో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు గాలింపు చేపట్టారు. అరెస్ట్ చేస్తారనే RGV పోలీసులకు చిక్కకుండా ఉన్నారని వార్తలొస్తున్నాయి.

Similar News

News November 26, 2024

BGT మధ్యలోనే ఇండియాకు కోచ్ గంభీర్

image

BGT సిరీస్ మధ్యలోనే టీమ్‌ఇండియా కోచ్ గంభీర్ AUS నుంచి ఇండియాకు తిరుగుపయనం కానున్నారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఆయన వస్తున్నట్లు India today తెలిపింది. అయితే, 2వ టెస్ట్ ప్రారంభమయ్యే నాటికి జట్టులో చేరే అవకాశాలున్నాయి. పెర్త్ తొలి టెస్టులో 295 పరుగుల విజయాన్ని అందుకున్న ఇండియా అడిలైడ్‌లో రెండో టెస్ట్ డిసెంబర్ 6నుంచి ఆడనుంది. రోహిత్, గిల్ జట్టుతో చేరనుండగా ప్లేయింగ్ 11 కూర్పుపై కసరత్తు జరుగుతోంది.

News November 26, 2024

పవన్ ఢిల్లీ టూర్.. ఇవాళ వరుస భేటీలు

image

AP: రెండు రోజుల పర్యటన కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌, అశ్వినీ వైష్ణవ్‌, లలన్‌ సింగ్‌తో వరుసగా భేటీ కానున్నారు. రేపు పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించనున్నారు.

News November 26, 2024

అసెంబ్లీ గడువు ముగిస్తే రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందేనా..

image

అలాంటి నిబంధనేమీ లేదు. రాజకీయ అనిశ్చితిని బట్టి గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపిస్తారు. స్థిరత్వం ఉంటే ఆపద్ధర్మ CMను నియమిస్తారు. లేదంటే రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపుతారు. <<14711279>>మహారాష్ట్ర<<>>లో 4 సందర్భాల్లో అసెంబ్లీ గడువు ముగిశాకా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారు. 2004, 2009, 2014, 2019లో అసెంబ్లీ గడువులు ముగిసినా 7-30 రోజులు వ్యవధి తర్వాత కొత్త సీఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారీ అలాగే జరగొచ్చు.