News November 26, 2024
IPLలో చిత్తూరు కుర్రాడికి షాక్ !

మొట్టమొదటి సారిగా IPL వేలం పాటలోకి ఉ.చిత్తూరు జిల్లాకు చెందిన క్రీడాకారుడు గిరీశ్ కుమార్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లెకి చెందిన ఈయన SVUలో బీటెక్ పూర్తిచేశాడు. క్రికెట్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ఆయన IPL వేలంపాటలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సారి గిరీశ్ కుమార్ రెడ్డిని ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
Similar News
News January 11, 2026
నెలాఖరిన కుప్పంలో CM పర్యటన

CM చంద్రబాబు జనవరి చివర్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జనవరి 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో CM కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించనున్నారు. మూడు రోజుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 1న కుప్పంలో నూతన పెన్షన్లను CM లబ్ధిదారులకు ఇవ్వనున్నారు.
News January 11, 2026
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం జరగనున్న గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమం జరగనుందని చెప్పారు. జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.
News January 11, 2026
కుప్పం ఏరియాకు భారీ ప్రాజెక్ట్

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మానేంద్రం గ్రామంలో విమాన తయారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. HANSA-3(NG) రెండు సీట్ల ట్రైనర్ విమానాల తయారీ, ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటుకు 55.47 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. రూ.159 కోట్లతో రెండు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 250మందికి ఉపాధి లభించనుంది. ఏటా 108 విమానాల తయారీ చేయనున్నారు.


