News November 26, 2024
నేటి నుంచి భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని IMD తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశంలో 3 రోజులు వానలుంటాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News November 26, 2024
IPL: పృథ్వీ షాను అందుకే తీసుకోలేదా?
ముంబై బ్యాటర్ పృథ్వీ షా IPL-2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలారు. ఫామ్ లేమి, అధిక బరువు, ఫిట్‌నెస్ సమస్యలు, వ్యక్తిగత వివాదాలు ఇందుకు కారణమని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. తరచూ గాయాలబారిన పడుతున్న అతడు సీజన్ మొత్తం ఆడగలడనే నమ్మకం ఫ్రాంచైజీల్లో కలగలేదని అంటున్నాయి. IPLలో DC తరఫున 2018లో అరంగేట్రం చేసిన షా ఆ సీజన్‌లో 153 స్ట్రైక్ రేటుతో రాణించారు. ఆ తర్వాతి సీజన్లలో అతడి SR 134, 137కి తగ్గింది.
News November 26, 2024
RGV ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను AP హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పోలీసులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు ఎస్పీ ప్రత్యేక బృందాలను పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టారని RGVపై మద్దిపాడు PSలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
News November 26, 2024
3 బంతులకు 30 పరుగులు ఇచ్చేశాడు
అబుదాబి T10 లీగ్‌లో BGT ఆల్‌రౌండర్ దసున్ షనక బౌలింగ్‌లో లయ తప్పారు. DBLతో మ్యాచ్‌లో 9వ ఓవర్ వేసిన అతను తొలి 3 బంతుల్లోనే 30(4, 4+nb, 4+nb, 4, 6, nb, 4+nb) పరుగులు, ఆ తర్వాత 3 బాల్స్‌కు 3 రన్స్ ఇచ్చారు. మొత్తంగా ఆ ఓవర్‌లో 33 రన్స్ వచ్చాయి. అనంతరం బ్యాటింగ్‌లో దసున్ 14 బంతుల్లో 33 పరుగులు(3 సిక్సులు, 2 ఫోర్లు) చేశారు. తొలుత ఢిల్లీ 123/6 స్కోర్ చేయగా, బంగ్లా 9.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.