News November 26, 2024
పెరుగుతున్న చలి.. 3 రోజులు జాగ్రత్త!
TG: రాష్ట్రంలో రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉందని తెలిపింది. నిన్న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చాలా చోట్ల 10 డిగ్రీలు, HYD శివారులోని పటాన్ చెరు ప్రాంతంలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News November 26, 2024
నా సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి: స్వరూపానందేంద్ర
AP: తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి లేఖ రాశారు. ఇప్పటివరకు రక్షణ కల్పించిన YCP, TDP ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తపస్సు చేసుకుంటూ రిషికేశ్‌లోనే గడుపుతానని ప్రకటించారు. YCP ప్రభుత్వం గతంలో శారదాపీఠానికి వైజాగ్ వద్ద రూ.225Cr విలువైన 15ఎకరాలను రూ.15 లక్షలకే కేటాయించింది. కూటమి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది.
News November 26, 2024
పుష్ప-2కు మూడో మ్యూజిక్ డైరెక్టర్?
పుష్ప-2 ప్రాజెక్టులోకి ముచ్చటగా మూడో సంగీత దర్శకుడు ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖైదీ, క, డిమోంటీ కాలనీ-2 తదితర చిత్రాలకు పనిచేసిన శామ్ CS పుష్పలోని ఓ ఫైట్ సీక్వెన్స్‌కు BGM అందిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ జాతర గెటప్‌ను ఆయన ఇవాళ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వార్తలు నిజమేనని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. DSPతో పాటు తాను BGM అందిస్తున్నట్లు తమన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 26, 2024
మహారాష్ట్ర సీఎం పీఠం బీజేపీదే?
మహారాష్ట్ర సీఎం ఎవరనే సందిగ్ధానికి తెర పడినట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడణవీస్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శిండే వర్గానికి 12, అజిత్ వర్గానికి 10 చొప్పున మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని సమాచారం.