News November 26, 2024
నేడు సరస్వతి అమ్మవారి హుండీ లెక్కింపు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారికి మొక్కుల రూపంలో సమర్పించిన హుండీ కానుకలను నేడు ఆలయ ప్రాంగణంలో లెక్కించనున్నట్లు ఆలయ కార్యనిర్వణాధికారి విజయ రామారావు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు, పోలీసు, బ్యాంకు సిబ్బంది, స్వచ్ఛంద సేవా సమితి భక్తులు పాల్గొననున్నారు.
Similar News
News March 14, 2026
ఆదిలాబాద్‌లో పది పరీక్షకు 23 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం నిర్వహించిన పరీక్షకు 10887 మంది విద్యార్థులకు గాను 10864 విద్యార్థులు హాజరై 23 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లా అధికారులు విస్తృతంగా సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
News March 14, 2026
భూభారతి పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాల అమలుపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.