News November 26, 2024
మహారాష్ట్ర CM పీఠానికి 2 ఆప్షన్లు!

మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి ఘన విజయం సాధించగా CM పీఠం ఎవరిదనే దానిపై ఉత్కంఠ వీడలేదు. 2 ఆప్షన్లపై కూటమి నేతలు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఫడణవీస్, ఏక్‌నాథ్ శిండే చెరో రెండున్నరేళ్లు కుర్చీ పంచుకోవడం తొలి ఆప్షన్ కాగా, 2+2+1(ఫడణవీస్, శిండే, అజిత్ పవార్) ఫార్ములాతో సీఎం పీఠాన్ని అధిష్ఠించడం రెండో ఆప్షన్. రెండ్రోజులుగా దీనిపై నడ్డా, అమిత్ షా చర్చలు జరుపుతుండగా ఇవాళ ఫైనల్ అయ్యే ఛాన్సుంది.
Similar News
News November 9, 2025
మనిషికి సంస్కారం ఎందుకు ఉండాలి? అదెలా వస్తుంది?

శరీర మలినాన్ని స్నానం తొలగించినట్లే, జీవులకు అంటిన అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించి, సద్గుణాలు ప్రసాదించేదే నిజమైన సంస్కారం. ఈ కర్మ బాహ్య శుద్ధి కాదు, ఆత్మ శుద్ధి. మనస్సుకు, బుద్ధికి జ్ఞానంతో సంస్కారం చేయడం ద్వారానే మానవుడు దివ్యత్వాన్ని పొందగలడు. ఆచారాలు, సత్కర్మల ద్వారా మనసును సంస్కరించుకుని, ఉత్తమ జీవనం సాగించడమే మన లక్ష్యం. సంస్కారాన్ని తల్లిదండ్రులు, వేదాల పఠనంతో పొందవచ్చు. <<-se>>#VedikVibes<<>>
News November 9, 2025
గంగూలీ ICC అధ్యక్షుడు అవుతారు: మమతా బెనర్జీ

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒక రోజు ICC ప్రెసిడెంట్ అవుతారని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో WWC విన్నర్ రిచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను కొన్ని విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడుతానని, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడిగా గంగూలీనే ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా గతంలో ఆయన BCCI అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
News November 9, 2025
గుకేశ్‌కు షాక్.. చెస్ వరల్డ్ కప్‌లో ఓటమి

గోవా వేదికగా జరుగుతోన్న చెస్ వరల్డ్ కప్‌లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్ తగిలింది. మూడో రౌండ్‌లో ఫ్రెడరిక్ స్వాన్(జర్మనీ) చేతిలో 0.5-1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, అర్జున్, హరికృష్ణ, ప్రణవ్ తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు.
* ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్ చెస్ ఛాపింయన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రాహుల్.. భారత్ తరఫున 91వ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు.


