News November 26, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.
Similar News
News January 17, 2026
మెదక్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో 32, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌లో 15, రామాయంపేటలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News January 17, 2026
మెదక్: ప్రాణరక్షణకు హెల్మెట్ తప్పనిసరి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు హెల్మెట్ ధరించడం అత్యంత కీలకమని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను కేవలం నిబంధనగా కాకుండా, వ్యక్తిగత భద్రతగా భావించాలని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు.
News January 17, 2026
మెదక్ మున్సిపాలిటీలు.. మహిళలకే పట్టం!

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళా గర్జన వినిపించనుంది. ఛైర్‌పర్సన్ పీఠాలన్నీ మహిళలకే రిజర్వు కావడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. మెదక్ స్థానం బీసీ మహిళకు దక్కగా.. తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. దీంతో ఆశావహుల సందడి మొదలైంది. వార్డుల వారీగా రిజర్వేషన్లను కూడా అధికారులు అధికారికంగా ప్రకటించారు.


