News November 26, 2024
మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు
AP: వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై యర్రావారిపాలెం పోలీసులు పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగిందంటూ దుష్ప్రచారం చేశారని, తమ పరువుకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Similar News
News November 26, 2024
Warning: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?
ఆండ్రాయిడ్ 12- ఆండ్రాయిడ్ 15 వరకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫోన్లను వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఓఎస్‌లో చాలా లోపాలున్నాయని భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) తేల్చిచెప్పింది. వీటిని హ్యాకర్లు గుర్తిస్తే వినియోగదారుల భద్రతకు తీవ్రస్థాయి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అప్‌డేట్స్ రాగానే వెంటనే ఫోన్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
News November 26, 2024
‘జీబ్రా’కు అలా జరగకూడదని కోరుకుంటున్నా: సత్యదేవ్
‘జీబ్రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ఎమోషనల్ పోస్టు చేశారు. ‘ఇది మీరు ఇచ్చిన విజయం. థియేట్రికల్ హిట్ కోసం ఐదేళ్లుగా ఎదురుచూశా. నేను హిట్ కొడితే మీరు కొట్టినట్లే ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాను మీరు థియేటర్‌లో మిస్సై తర్వాత OTT, యూట్యూబ్‌లో చూసి ప్రశంసలు కురిపించారు. జీబ్రాకు అలా జరగకూడదు. దయచేసి మూవీని థియేటర్లలో చూడండి’ అని రాసుకొచ్చారు.
News November 26, 2024
నా సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి: స్వరూపానందేంద్ర
AP: తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి లేఖ రాశారు. ఇప్పటివరకు రక్షణ కల్పించిన YCP, TDP ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తపస్సు చేసుకుంటూ రిషికేశ్‌లోనే గడుపుతానని ప్రకటించారు. YCP ప్రభుత్వం గతంలో శారదాపీఠానికి వైజాగ్ వద్ద రూ.225Cr విలువైన 15ఎకరాలను రూ.15 లక్షలకే కేటాయించింది. కూటమి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది.