News November 26, 2024

STOCK MARKETS: నిన్న లాభాల వర్షం.. నేడెలా మొదలయ్యాయంటే..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, నిన్నటి లాభాల తర్వాత మదుపర్ల అప్రమత్తత, సూచీలు కీలక రెసిస్టెన్సీ స్థాయులకు చేరడమే ఇందుకు కారణాలు. సెన్సెక్స్ 80,368 (+263), నిఫ్టీ 24310 (+88) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మెటల్, రియాల్టి రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. ULTRACEMCO, EICHERMOT, BAJAJ AUTO, TRENT, BAJAJ FINSERV టాప్ లూజర్స్.

Similar News

News November 26, 2024

ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

image

ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆ రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 13తో ముగియనుంది. డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మోపిదేవి, బీద మస్తాన్, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

News November 26, 2024

జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎంతో చర్చిస్తాం: పవన్

image

AP: వైసీపీ ప్రభుత్వ తప్పులు రాష్ట్రానికి శాపాలుగా మారాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాటిని ఇప్పుడు తాము సరిదిద్దాల్సి వస్తోందన్నారు. జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వానికి అస్సలు బాధ్యత లేదని, సమోసాల కోసమే రూ.9కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.

News November 26, 2024

BREAKING: రేపు తుఫాన్

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్లు APSDMA వెల్లడించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ రేపు తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది 2 రోజుల్లో తమిళనాడు తీరానికి చేరనుందని పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో 29వ తేదీ వరకు అక్కడక్కడా భారీ వర్షాలు, పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.