News November 26, 2024

సంచలన కేసులో ఉత్కంఠ.. నేడు కీలక వ్యక్తి అరెస్ట్?

image

సీఐడీ విశ్రాంత అదనపు SP విజయ్ పాల్ నేడు ప్రకాశం జిల్లా SP ఎదుట విచారణకు హాజరుకానున్నారు. YCP హయాంలో ఓ కేసు విచారణలో ప్రస్తుత ఉండి MLA రఘురామను హింసించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇవాళ విచారణ అనంతరం విజయ్ పాల్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కాగా నాడు MPగా ఉన్న RRRను విచారణలో కొట్టారనే ఆరోపణలు, సుప్రీంకోర్టులో విచారణ, ఆయనను ఆర్మీ హాస్పిటల్‌కు తరలించడం సంచలనం సృష్టించాయి.

Similar News

News January 11, 2026

ప.గో: పందెపు బరుల ఏర్పాటు.. బౌన్సర్లతో భద్రత!

image

సంక్రాంతి సమీపిస్తుండటంతో జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో కోడిపందాల బరుల ఏర్పాటు వేగవంతమైంది. పొలాలు, లేఅవుట్లను చదును చేసి, ప్రేక్షకుల కోసం భారీ గ్యాలరీలు, అతిథుల కోసం ప్రత్యేక విడిది సౌకర్యాలను నిర్మిస్తున్నారు. పందేల వద్ద గొడవలు జరగకుండా ముందస్తుగా ప్రైవేట్ బౌన్సర్లను సైతం నియమిస్తున్నారు. పండుగకు ముందే పందెం రాయుళ్ల హడావుడితో ఊళ్లన్నీ కళకళలాడుతున్నాయి.

News January 11, 2026

భీమవరంలో రౌడీయిజం.. మద్యం మత్తులో దాడి!

image

భీమవరం రైతు బజార్ సమీపంలోని వైన్ షాప్ వద్ద మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు ఒకరిపై దాడి చేసి గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో వన్ టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేశారు. ప్రజాశాంతికి భంగం కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగరాజు హెచ్చరించారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

News January 10, 2026

ప.గో: కోట్లల్లో పందేలు.. ఎందుకంటే!

image

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ శాశ్వత భవన నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని స్పష్టం చేసినా, అటు భీమవరం.. ఇటు ఉండి నియోజకవర్గాల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో భవనం ఎక్కడ నిర్మిస్తారనే అంశంపై జిల్లాలోని జూదరలు రూ.కోట్లలో పందాలు కాస్తుండటం చర్చనీయాంశంగా మారింది.