News November 26, 2024
వాణిజ్య యుద్ధంలో విజేతలు ఉండరు: చైనా
చైనాతో <<14711264>>వాణిజ్యంలో ఆంక్షలు విధించాలని<<>> అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో చైనా స్పందించింది. వాణిజ్యంలో యుద్ధం వలన ఏ దేశానికీ లాభం ఉండదని అమెరికాలో చైనా ఎంబసీ అధికార ప్రతినిధి లియూ పెంగ్యూ వ్యాఖ్యానించారు. అది ఎవరూ గెలవని పోరు అని అభివర్ణించారు. చైనా-అమెరికా వాణిజ్య సహకారం పరస్పర లాభదాయకమని తాము భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Similar News
News November 26, 2024
19 రకాల వ్యాపారాల గుర్తింపు: మంత్రి సీతక్క
TG: మహిళలను లక్షాధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలను గుర్తించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. మహిళలు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్‌లోని శిల్పారామంలో విక్రయించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె స్పష్టం చేశారు.
News November 26, 2024
నిలబడి నీళ్లు తాగుతున్నారా..?
నిలబడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. నిలబడి తాగితే నీరు వేగంగా కడుపులోకి ప్రవేశించి ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్‌కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీటి వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే కూర్చొని తాగాలని, అది కూడా ఒక సిప్ తరువాత మరొకటి తీసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులంటున్నారు. Share It.
News November 26, 2024
IPL తెలుగు తేజాలకు నారా లోకేశ్ విషెస్
AP: వచ్చే ఏడాది IPLలో వివిధ జట్లకు ఆడనున్న తెలుగు ఆటగాళ్లకు మంత్రి నారా లోకేశ్ కంగ్రాట్స్ చెప్పారు. ‘నితీశ్ రెడ్డి, షేక్ రషీద్, పైలా అవినాశ్, త్రిపురాన విజయ్, సత్యనారాయణ రాజు. ఐపీఎల్ జట్లకు మీరు ఎంపికైనందుకు కంగ్రాట్స్. మీ విజయానికి నా బెస్ట్ విషెస్. ప్రపంచ క్రికెట్‌లో వెలిగి మమ్మల్ని గర్వించేలా చేయండి. కష్టం, నిబద్ధత, ఆట పట్ల ప్రేమ మీ అందర్నీ గొప్పగా మార్చాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.