News November 26, 2024
RGV ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను AP హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పోలీసులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు ఎస్పీ ప్రత్యేక బృందాలను పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టారని RGVపై మద్దిపాడు PSలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Similar News
News November 26, 2024
IPL తెలుగు తేజాలకు నారా లోకేశ్ విషెస్
AP: వచ్చే ఏడాది IPLలో వివిధ జట్లకు ఆడనున్న తెలుగు ఆటగాళ్లకు మంత్రి నారా లోకేశ్ కంగ్రాట్స్ చెప్పారు. ‘నితీశ్ రెడ్డి, షేక్ రషీద్, పైలా అవినాశ్, త్రిపురాన విజయ్, సత్యనారాయణ రాజు. ఐపీఎల్ జట్లకు మీరు ఎంపికైనందుకు కంగ్రాట్స్. మీ విజయానికి నా బెస్ట్ విషెస్. ప్రపంచ క్రికెట్‌లో వెలిగి మమ్మల్ని గర్వించేలా చేయండి. కష్టం, నిబద్ధత, ఆట పట్ల ప్రేమ మీ అందర్నీ గొప్పగా మార్చాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
News November 26, 2024
త్వరలో రెండో దశ మెట్రో పనులు: NVS రెడ్డి
TG: త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై సీఎం రేవంత్ సూచనలతో ముందుకు వెళ్తామన్నారు. పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలని సీఎం సూచించారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానంలో HYD ఉందని.. వెంటనే మెట్రో విస్తరించకపోతే 9వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
News November 26, 2024
చంద్రబాబు, ఏక్‌నాథ్ శిండే విజయాల వెనుక కామన్ పాయింట్ ఇదే
AP అసెంబ్లీ ఎన్నికల్లో TDP 135 స్థానాల్లో ఘన విజయం సాధించడానికి కృషి చేసిన పొలిటికల్ కన్సల్టెన్సీ షో టైం మహారాష్ట్రలో శివసేన(శిండే) కోసం పని చేసింది. 81 సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ 70% Strike Rateతో 57 స్థానాల్లో నెగ్గడం వెనుక షో టైం రాబిన్ శర్మ కీలకం. శిండేను Man of Massesగా, ఆర్థిక సాయం పథకాలతో ఆయన్ను మహిళా పక్షపాతిగా ప్రొజెక్ట్ చేసి ఓట్లు రాబట్టడంలో రాబిన్ సక్సెస్ అయ్యారు.