News November 26, 2024

మహారాష్ట్ర సీఎం పీఠం బీజేపీదే?

image

మహారాష్ట్ర సీఎం ఎవరనే సందిగ్ధానికి తెర పడినట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడణవీస్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు సమాచారం. మరికాసేపట్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శిండే వర్గానికి 12, అజిత్ వర్గానికి 10 చొప్పున మంత్రి పదవులు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని సమాచారం.

Similar News

News November 26, 2024

పెళ్లి పీటలెక్కబోతున్న అక్కినేని అఖిల్

image

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, నటుడు అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా తెలిపారు. జైనాబ్ రవ్‌డ్జీతో అఖిల్ ఎంగేజ్‌మెంట్ జరిగిందని ప్రకటించారు. వారిద్దరిని అందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. కాగా వచ్చే నెల 4న అఖిల్‌ సోదరుడు నాగచైతన్య కూడా శోభిత ధూళిపాళను వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

News November 26, 2024

21 ఏళ్లకే 195 దేశాలు చుట్టేసి రికార్డ్!

image

జీవితకాలంలో వేరే దేశాన్ని ఓసారి చూస్తే గొప్ప అనుకుంటాం. కానీ US యువతి లెక్సీ ఆల్ఫోర్డ్ 21 ఏళ్ల వయసుకే 195 దేశాలు చుట్టేసి గిన్నిస్ రికార్డుకెక్కారు. తాజాగా విద్యుత్ కారులో ప్రపంచమంతా తిరిగిన తొలి వ్యక్తిగా మరో రికార్డునూ సృష్టించారు. కారులో 200 రోజుల పాటు 6 ఖండాలను దాటారు. తన తల్లిదండ్రులు ట్రావెల్ ఏజెంట్లుగా చేసేవారని, వారి స్ఫూర్తితోనే ఈ ప్రయాణాన్ని పూర్తి చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారామె.

News November 26, 2024

‘రక్తంతో సంతకం.. మోసం చేస్తే ఆత్మహత్య చేసుకోవాలి’

image

జపాన్‌లో 150 ఏళ్ల చరిత్ర కలిగిన షికోకు బ్యాంక్ తమ సిబ్బందిగా చేరేవారికి అసాధారణ నిబంధనలు పెట్టింది. ‘ఇక్కడ ఉద్యోగం చేసేవారు డబ్బు చోరీ చేసినా, దొంగతనానికి సహకరించినా ఆ మొత్తాన్ని చెల్లించి ఆత్మహత్య చేసుకోవాలి’ అని అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ మేరకు అధికారిక డాక్యుమెంట్‌పై రక్తంతో సంతకం చేయాలని పేర్కొంది. ఉద్యోగుల్లో నైతికత పెంచేందుకు ఎన్నో ఏళ్లుగా ఇలా చేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.