News November 26, 2024
PAN 2.0కు ఆమోదం: ఇకపై PAN కార్డులు పనిచేయవా?

ప్రస్తుతం వాడుతున్న PAN కార్డులు పనిచేస్తాయి. అన్ని సేవలకూ దానిని వాడుకోవచ్చు. <<14708948>>PAN 2.0<<>> ప్రాజెక్టు ఆరంభమయ్యాక పాతవాటిని QR కోడ్ ముద్రించే కొత్తవాటికి అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ఒక వెబ్‌పోర్టల్ తీసుకొస్తోంది. ఇప్పుడున్న నంబర్ మాత్రం మారదు. అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. PAN/TAN వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయడమే ప్రాజెక్టు ఉద్దేశం.
Similar News
News February 2, 2026
బ్రాండ్లు వేరైనా.. యజమాని ఒక్కరే

మార్కెట్‌లో వేర్వేరు బ్రాండ్ల మధ్య పోటీ ఉందని భావిస్తాం. కానీ కొన్నిసార్లు మన డబ్బు ఒకే సంస్థ జేబులోకి వెళ్తుంది. దీన్నే మల్టీ బ్రాండింగ్ స్ట్రాటజీ అంటారు. ఉదాహరణకు అప్సర, నటరాజ్.. రెండు పెన్సిల్స్ ఒకే సంస్థవి. లక్స్, లైఫ్‌బాయ్ సబ్బులు కూడా హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థకు చెందినవి. ఆడి, స్కోడా కార్లు వోక్స్‌వ్యాగన్ గ్రూపువి. ప్రతి రకమైన కస్టమర్‌ను ఆకట్టుకోవడానికి కంపెనీలు ఈ స్ట్రాటజీని వాడుతాయి.
News February 2, 2026
900 మంది టీచర్ల కుటుంబాలకు జరగని న్యాయం!

AP: విధుల్లో ఉండగా 2019-2025 మధ్య అకాల మరణం పొందిన 900 మంది టీచర్ల కుటుంబాల్లో ఇంకా అంధకారం తొలగలేదు. చనిపోయిన వారి పిల్లల్లో ఒకరికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. కానీ ఆరేళ్లుగా అధికారులను కలుస్తున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ‘6 నెలల కిందట Dy.CM పవన్‌ను కలవగా ఆయన CMOకు లెటర్ పంపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News February 2, 2026
ఐసీసీ టోర్నీల్లో గతంలోనూ బహిష్కరణలు

భారత్‌తో జరగాల్సిన వరల్డ్ కప్ మ్యాచ్‌ను పాక్ ప్రభుత్వం బాయ్‌కాట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలలో మ్యాచ్‌లు రద్దవ్వడం కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 1996 వరల్డ్‌కప్‌లో భద్రతా కారణాలతో శ్రీలంకలో ఆడేందుకు ఆసీస్, వెస్టిండీస్ నిరాకరించాయి. దీంతో శ్రీలంకకు వాకోవర్ లభించింది. 2003 WCలో జింబాబ్వేతో మ్యాచ్‌ను ఇంగ్లండ్, కెన్యాతో మ్యాచ్‌ను న్యూజిలాండ్ బహిష్కరించాయి.


