News November 26, 2024

రూ.27 కోట్లలో రిషభ్ చేతికి వచ్చేది ఎంతంటే..

image

IPL చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. లక్నో అతడిని రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దీనిలో రూ.8.1 కోట్లు పన్నుగా వెళ్లిపోగా పంత్ చేతికి రూ.18.9 కోట్లు అందుతాయి. ఒకవేళ టోర్నీకి ముందే గాయపడినా, వ్యక్తిగత కారణాలతో తప్పుకొన్నా ఆ డబ్బు రాదు. టోర్నీ మధ్యలో గాయపడి తప్పుకుంటే మాత్రం చెల్లిస్తారు. భారత మ్యాచ్‌లకు ఆడుతూ గాయపడినా డబ్బు దక్కుతుంది.

Similar News

News November 26, 2024

గృహ ప్రవేశం.. ఇబ్బంది పెట్టిన ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్

image

TG: ఇటీవల శుభకార్యాల్లో డబ్బు ఇవ్వాలని ట్రాన్స్‌జెండర్లు ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదులు పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లోని ఓ గృహప్రవేశ కార్యక్రమంలో డబ్బు ఇవ్వాలంటూ ఆ ఇంటి యజమానులను కొందరు ట్రాన్స్‌జెండర్లు ఇబ్బంది పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో ఏడుగురు ట్రాన్స్‌జెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News November 26, 2024

ఉపాధి హామీలో కొత్త పనులు చేర్చండి: పవన్ కళ్యాణ్

image

AP: ఉపాధి హామీ పథకంలో కొత్త పనులు చేర్చాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ‘ఉపాధి పనుల్లో పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు కట్టుకోవడానికి 90 రోజుల పనిదినాలను 100 రోజులకు పెంచండి. ఉపాధి నిధులతో శ్మశానవాటికలు, పంచాయతీ భవనాల ప్రహరీలు, దోబీఘాట్‌లు, ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి పనులకు అవకాశం కల్పిస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది’ అని పవన్ కోరారు.

News November 26, 2024

మీకు PAN కార్డు ఉందా..? అయితే ఇది తెలుసుకోండి

image

PAN 2.0 త్వ‌ర‌లో ప్రారంభం అవుతుండడంతో ప్ర‌స్తుతం పాన్ కార్డు ఉన్న వారు పాత కార్డుల‌ను మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని CBDT ప్ర‌క‌టించింది. ఒక‌వేళ పాన్ కార్డులోని వివ‌రాల‌ను మార్చుకోవాల‌నుకుంటే PAN 2.0 ప్రాజెక్టు ప్రారంభ‌మ‌య్యాక ఉచితంగా మార్చుకోవ‌చ్చని తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా PAN/TAN సేవలు అప్‌గ్రేడెడ్ డిజిట‌లైజేష‌న్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయగలిగేలా ఒకే పోర్టల్‌లో అందుబాటులోకొస్తాయి.