News November 26, 2024
సెకీ ఒప్పందాలపై ACBకి ఫిర్యాదు
AP: సెకీతో విద్యుత్ ఒప్పందాలపై ACBకి సెంటర్ ఫర్ లిబర్టీ ఫిర్యాదు చేసింది. గత ప్రభుత్వంలో జగన్, అదానీ మధ్య జరిగిన డీల్‌పై విచారించాలంటూ పలు ఆధారాలను అందించింది. జగన్, విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌తో పాటు అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిని విచారించాలని కోరింది. ఈ ఒప్పందంతో రాష్ట్రానికి భారీ నష్టమని, ప్రభుత్వం స్పందించి విచారణ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.
Similar News
News November 26, 2024
గృహ ప్రవేశం.. ఇబ్బంది పెట్టిన ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్
TG: ఇటీవల శుభకార్యాల్లో డబ్బు ఇవ్వాలని ట్రాన్స్‌జెండర్లు ఇబ్బందులు పెడుతున్నారనే ఫిర్యాదులు పెరిగిపోయాయి. తాజాగా హైదరాబాద్‌లోని నందగిరి హిల్స్‌లోని ఓ గృహప్రవేశ కార్యక్రమంలో డబ్బు ఇవ్వాలంటూ ఆ ఇంటి యజమానులను కొందరు ట్రాన్స్‌జెండర్లు ఇబ్బంది పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో ఏడుగురు ట్రాన్స్‌జెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News November 26, 2024
ఉపాధి హామీలో కొత్త పనులు చేర్చండి: పవన్ కళ్యాణ్
AP: ఉపాధి హామీ పథకంలో కొత్త పనులు చేర్చాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ‘ఉపాధి పనుల్లో పీఎం ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు కట్టుకోవడానికి 90 రోజుల పనిదినాలను 100 రోజులకు పెంచండి. ఉపాధి నిధులతో శ్మశానవాటికలు, పంచాయతీ భవనాల ప్రహరీలు, దోబీఘాట్‌లు, ఆరోగ్య కేంద్రాలు, తాగునీటి పనులకు అవకాశం కల్పిస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది’ అని పవన్ కోరారు.
News November 26, 2024
మీకు PAN కార్డు ఉందా..? అయితే ఇది తెలుసుకోండి
PAN 2.0 త్వరలో ప్రారంభం అవుతుండడంతో ప్రస్తుతం పాన్ కార్డు ఉన్న వారు పాత కార్డులను మార్చుకోవాల్సిన అవసరం లేదని CBDT ప్రకటించింది. ఒకవేళ పాన్ కార్డులోని వివరాలను మార్చుకోవాలనుకుంటే PAN 2.0 ప్రాజెక్టు ప్రారంభమయ్యాక ఉచితంగా మార్చుకోవచ్చని తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా PAN/TAN సేవలు అప్‌గ్రేడెడ్ డిజిటలైజేషన్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయగలిగేలా ఒకే పోర్టల్‌లో అందుబాటులోకొస్తాయి.