News November 26, 2024
చంద్రబాబు, ఏక్నాథ్ శిండే విజయాల వెనుక కామన్ పాయింట్ ఇదే

AP అసెంబ్లీ ఎన్నికల్లో TDP 135 స్థానాల్లో ఘన విజయం సాధించడానికి కృషి చేసిన పొలిటికల్ కన్సల్టెన్సీ షో టైం మహారాష్ట్రలో శివసేన(శిండే) కోసం పని చేసింది. 81 సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ 70% Strike Rateతో 57 స్థానాల్లో నెగ్గడం వెనుక షో టైం రాబిన్ శర్మ కీలకం. శిండేను Man of Massesగా, ఆర్థిక సాయం పథకాలతో ఆయన్ను మహిళా పక్షపాతిగా ప్రొజెక్ట్ చేసి ఓట్లు రాబట్టడంలో రాబిన్ సక్సెస్ అయ్యారు.
Similar News
News September 17, 2025
GST ద్వారా రూ.22లక్షల కోట్ల ఆదాయం: నిర్మల

AP: 2017కు ముందు 17రకాల పన్నులు, వాటిపై 8సెస్సులు ఉండేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘అన్నింటినీ కలిపి ఒకే పన్ను, 4 శ్లాబులుగా తీసుకొచ్చిందే GST. 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అప్పుడు 65లక్షల మంది పన్ను చెల్లించేవారు ఉండగా, ప్రస్తుతం 1.51కోట్లకు చేరారు. 2018లో GST ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వస్తే, 2025 నాటికి రూ.22.087లక్షల కోట్లకు చేరింది’ అని తెలిపారు.
News September 17, 2025
BREAKING: ఘోర ప్రమాదం.. ఆరుగురు మృతి

AP: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారు, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News September 17, 2025
MIMకు భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారు: కిషన్ రెడ్డి

TG: మజ్లిస్ పార్టీకి వత్తాసు పలికేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం చరిత్రను వక్రీకరించి విమోచన దినోత్సవానికి అనేక పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీకి భయపడి వాస్తవాలను తొక్కిపెడుతున్నారని ఫైరయ్యారు. మూడేళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలో ఘనంగా విమోచన వేడుకలు నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.