News November 26, 2024

త్వరలో రెండో దశ మెట్రో పనులు: NVS రెడ్డి

image

TG: త్వరలోనే హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ పనులు ప్రారంభిస్తామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌ సూచనలతో ముందుకు వెళ్తామన్నారు. పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మెట్రో అభివృద్ధి చేయాలని సీఎం సూచించారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానంలో HYD ఉందని.. వెంటనే మెట్రో విస్తరించకపోతే 9వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

Similar News

News November 26, 2024

మీకు PAN కార్డు ఉందా..? అయితే ఇది తెలుసుకోండి

image

PAN 2.0 త్వ‌ర‌లో ప్రారంభం అవుతుండడంతో ప్ర‌స్తుతం పాన్ కార్డు ఉన్న వారు పాత కార్డుల‌ను మార్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని CBDT ప్ర‌క‌టించింది. ఒక‌వేళ పాన్ కార్డులోని వివ‌రాల‌ను మార్చుకోవాల‌నుకుంటే PAN 2.0 ప్రాజెక్టు ప్రారంభ‌మ‌య్యాక ఉచితంగా మార్చుకోవ‌చ్చని తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా PAN/TAN సేవలు అప్‌గ్రేడెడ్ డిజిట‌లైజేష‌న్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయగలిగేలా ఒకే పోర్టల్‌లో అందుబాటులోకొస్తాయి.

News November 26, 2024

రఘురామకృష్ణరాజు కేసు.. విజయ్‌పాల్ అరెస్ట్

image

AP: మాజీ MP, ప్రస్తుత Dy స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసుకు సంబంధించి సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం నుంచి పాల్‌ను సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో విజయ్ పాల్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

News November 26, 2024

బాపూ ఘాట్ అభివృద్ధికి సహకరించండి: సీఎం

image

HYD లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్ అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ను CM రేవంత్ విజ్ఞప్తి చేశారు. ‘గాంధీ చితాభస్మాన్ని కలిపిన చోటును ప్రపంచస్థాయిలో తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఇక్కడ గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, శాంతి విగ్రహం ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాలను బదిలీ చేయండి’ అని CM కోరారు.