News November 26, 2024

19 రకాల వ్యాపారాల గుర్తింపు: మంత్రి సీతక్క

image

TG: మహిళలను లక్షాధికారులను చేసేందుకు 19 రకాల వ్యాపారాలను గుర్తించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. మహిళలు తయారు చేసిన వస్తువులను హైదరాబాద్‌లోని శిల్పారామంలో విక్రయించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Similar News

News November 26, 2024

నన్ను దారుణంగా ట్రోల్ చేశారు: నయనతార

image

గజిని సినిమా సమయంలో తాను దారుణమైన ట్రోలింగ్‌కు, అవహేళనకు గురయ్యానని నటి నయనతార నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో తెలిపారు. ‘గజిని సినిమాకి అసలు నన్నెందుకు తీసుకున్నారంటూ కొంతమంది ప్రశ్నించారు. ఇంత లావుగా ఉండి ఎందుకు నటిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. నటనపై విమర్శిస్తే తీసుకుంటాను. కానీ బాడీ షేమింగ్ తట్టుకోవడం చాలా కష్టమనిపించింది. నా జీవితంలో అదే అత్యంత బాధపడిన సందర్భం’ అని వెల్లడించారు.

News November 26, 2024

రూ.10వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా కొత్త టెక్స్‌టైల్ పాలసీ: చంద్రబాబు

image

AP: పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా కొత్త టెక్స్‌టైల్ పాలసీ రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా దీన్ని రూపకల్పన చేశామన్నారు. 2 లక్షల మందికి ఉద్యోగ/ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఎస్సీ, ST, BC, మైనార్టీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, రానున్న క్యాబినెట్‌లో దీనిపై చర్చిస్తామన్నారు.

News November 26, 2024

మొహమాటమే లేదు.. వద్దంటే వద్దంతే!

image

IPL వేలంపాట ఈసారి కాస్త భిన్నంగా జరిగింది. వరల్డ్ క్లాస్ ఫారిన్ క్రికెటర్లు అమ్ముడుపోకపోవడమే ఇందుకు ఉదాహరణ. గతంలో ఆటగాళ్లు ఫామ్‌లో లేకున్నా ఫ్రాంచైజీలు వారిపై నమ్మకం ఉంచి కొనుక్కునేవి. కానీ ఈసారి అలాంటిదేం కనిపించలేదు. విలియమ్సన్, వార్నర్, బెయిర్‌స్టో, స్మిత్, మిచెల్, ఆదిల్ రషీద్, జోసెఫ్, హోల్డర్, నబీ, సౌథీ వంటి టాప్ ప్లేయర్లు ఇటీవల ఫామ్‌లో లేకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.