News November 26, 2024
IPL: RCB టీమ్‌కు వరస్ట్ రేటింగ్

IPL మెగా వేలంలో ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్లను వెంటాడి మరీ కొనేశాయి. కానీ RCB మాత్రం సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేక చతికిలపడిందని జియోస్టార్ నిపుణులు అభిప్రాయపడ్డారు. తమ రేటింగ్స్‌లో వరస్ట్ కేటగిరీలో చేర్చారు. DC-8.8/10, SRH-8.2, PBKS-8, MI-8, CSK-7.9, GT-7.9, LSG-7.8, KKR-7.7, RR-7.7, RCB-7.4. ఏ జట్టు తెలివిగా ఆటగాళ్లను కొనుగోలు చేసిందో, ఏ జట్టు తెలివితక్కువగా తీసుకుందో కామెంట్ చేయండి.
Similar News
News November 12, 2025
ప్రకృతి ప్రళయం.. 30 ఏళ్లలో 80వేల మంది మృతి

భారత్‌లో గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా 80వేల మంది మరణించినట్లు ‘జర్మన్‌వాచ్’ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్(CRI) నివేదిక తెలిపింది. 1995 నుంచి తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 విపత్తులతో 130 కోట్ల మంది ప్రభావితమయ్యారంది. రూ.లక్షా 50వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. డొమెనికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.
News November 12, 2025
కొత్త వాహనాలు కొంటున్నారా?

APలో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి వారంలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ నంబర్ రాకపోతే ఆటోమేటిక్‌గా కేటాయింపు జరిగేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం శాశ్వత నంబర్ కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రూ.500-1000 ఇస్తేనే నంబర్ ఇస్తామని వాహన డీలర్లు బేరాలాడుతున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. ఇకపై వీటికి చెక్ పడనుంది.
News November 12, 2025
భారీ జీతంతో రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<


