News November 26, 2024

ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన పిల్ కొట్టేసిన సుప్రీం

image

ఈవీఎంలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని, బ్యాలెట్ విధానం మళ్లీ ప్రవేశపెట్టాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ పిటిషన్ వేశారు. పిటిషనర్ వాదనలో బలమైన కారణం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టేసింది.

Similar News

News November 26, 2024

రూ.10వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా కొత్త టెక్స్‌టైల్ పాలసీ: చంద్రబాబు

image

AP: పెట్టుబడులు సాధించడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా కొత్త టెక్స్‌టైల్ పాలసీ రూపొందించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రూ.10వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా దీన్ని రూపకల్పన చేశామన్నారు. 2 లక్షల మందికి ఉద్యోగ/ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలిపారు. ఎస్సీ, ST, BC, మైనార్టీలతో పాటు మహిళలకు అదనంగా ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని, రానున్న క్యాబినెట్‌లో దీనిపై చర్చిస్తామన్నారు.

News November 26, 2024

మొహమాటమే లేదు.. వద్దంటే వద్దంతే!

image

IPL వేలంపాట ఈసారి కాస్త భిన్నంగా జరిగింది. వరల్డ్ క్లాస్ ఫారిన్ క్రికెటర్లు అమ్ముడుపోకపోవడమే ఇందుకు ఉదాహరణ. గతంలో ఆటగాళ్లు ఫామ్‌లో లేకున్నా ఫ్రాంచైజీలు వారిపై నమ్మకం ఉంచి కొనుక్కునేవి. కానీ ఈసారి అలాంటిదేం కనిపించలేదు. విలియమ్సన్, వార్నర్, బెయిర్‌స్టో, స్మిత్, మిచెల్, ఆదిల్ రషీద్, జోసెఫ్, హోల్డర్, నబీ, సౌథీ వంటి టాప్ ప్లేయర్లు ఇటీవల ఫామ్‌లో లేకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు.

News November 26, 2024

మెగా డీఎస్సీ.. అభ్యర్థులకు GOOD NEWS

image

AP: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈలోగా టీచర్ ఉద్యోగ అభ్యర్థుల సౌలభ్యం కోసం మెగా డీఎస్సీ సిలబస్‌ను విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి ఏపీ డీఎస్సీ వెబ్‌సైటులో సిలబస్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు సిలబస్ కోసం <>వెబ్‌సైటును <<>>సంప్రదించాలని సూచించింది. కాగా DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది.