News November 26, 2024
అనారోగ్యంపై గూగుల్‌లో చూడటమూ రోగమే!
అరచేతిలో నెట్ ఉండటంతో స్వల్ప అస్వస్థత కలిగినా గూగుల్‌ని అడగడం చాలామందికి పరిపాటిగా మారింది. అలా చూడటం కూడా సైబర్‌కాండ్రియా అనే మానసిక రుగ్మతేనంటున్నారు వైద్యులు. ఓ అధ్యయనం ప్రకారం ఇంటర్నెట్ వాడేవారిలో 72శాతం మంది తమ ఆరోగ్య సమస్యలపై గూగుల్ చేస్తున్నారట. దీని వల్ల అపోహలతో ఆందోళనకు లోనయ్యే ప్రమాదముందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య ఉంటే వైద్యులకు చూపించుకోవడం సరైనదని సూచిస్తున్నారు.
Similar News
News November 26, 2024
ఏక్నాథ్ హైతో సేఫ్ హై.. CM పదవి కోసం పట్టువీడని శిండే వర్గం
మహారాష్ట్ర CM పదవి కోసం శివసేన శిండే వర్గం పట్టువీడటం లేదు. తాజాగా ఏక్నాథ్ శిండే ప్రచార బృందం వ్యూహాత్మక క్యాంపెయిన్‌ను జనంలోకి వదిలింది. ప్రధాని మోదీ నినదించిన ‘ఏక్ హైతో సేఫ్ హై’ను కాస్త ట్వీక్ చేసి ఏక్నాథ్ హైతో సేఫ్ హై అంటూ తన వాణిని బలంగా వినిపిస్తోంది. CM అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో శిండే వర్గం విశ్వప్రయత్నాల్లో ఉన్నట్టు ఈ ప్రచారం ద్వారా స్పష్టమవుతోంది.
News November 26, 2024
వెంటనే రైతుల అకౌంట్లోకి డబ్బులు: సీఎం
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు జరుగుతున్నాయి. సన్న రకాలకు ₹500 బోనస్ ఇవ్వాలి. రోజూ ధాన్యం కొనుగోళ్లపై నివేదిక ఇవ్వాలి’ అని CM సూచించారు.
News November 26, 2024
డాక్టర్ చైనాలో.. ఆపరేషన్ మొరాకోలో!
చైనాకు, మొరాకోకు 12వేల కిలోమీటర్ల దూరం. కానీ చైనాలోని షాంఘైలో ఉన్న వైద్యుడు మొరాకోలో ఉన్న రోగికి రోబోటిక్ విధానంలో ప్రోస్టేట్ క్యాన్సర్ సర్జరీని ఈ నెల 16న నిర్వహించారు. ఇంత దూరం నుంచి రిమోట్ సర్జరీ చేసిన తొలి వైద్యుడిగా రికార్డుకెక్కారు. దీనికోసం టౌమాయ్ రోబోట్‌ను, అత్యాధునిక సాంకేతికతను వాడినట్లు ఆయన వెల్లడించారు. కేవలం రెండు గంటల్లోనే ఆపరేషన్ ముగిసిందని, రోగి కోలుకుంటున్నారని తెలిపారు.