News November 26, 2024

‘ఉచిత కోచింగ్ కోసం ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలి’

image

విదేశాలకు వెళ్లి చదవాలనుకునే మైనార్టీ విద్యార్థుల కోసం IELTS, GRE, TOFEL పరీక్షలకు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి, అర్హత గల జిల్లా మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30 లోపు తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ HYD లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 17, 2025

ఖమ్మం జిల్లాలో 1,164 మద్యం టెండర్ల దరఖాస్తులు

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల కోసం గురువారం నాటికి 1,164 వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా 672 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 492 దరఖాస్తులు అందాయి. ఖమ్మం ఎక్సైజ్ 1 స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు 395 దరఖాస్తులు రాగా, ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్‌కు 215, నేలకొండపల్లి-90, వైరా-81, మధిర-98, సత్తుపల్లి- 247, సింగరేణి-40 దరఖాస్తులు నమోదయ్యాయి.

News October 17, 2025

ఆ ఆసుపత్రుల్లో ఆశించిన పురోగతి లేదు: ఖమ్మం కలెక్టర్

image

మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. వైద్య విధానం పరిషత్ ఆసుపత్రులలో ప్రసవాలు జులైలో 47 నుంచి సెప్టెంబర్ 74కు చేరాయని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆసుపత్రిలో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆసుపత్రులలో ఆశించిన పురోగతి లేదన్నారు.

News October 17, 2025

పత్తి విక్రయాల్లో స్లాట్‌ బుకింగ్‌ విధానం: ఖమ్మం కలెక్టర్‌

image

ఖమ్మం: పత్తి రైతులు ఇకపై స్లాట్ బుకింగ్ పద్ధతిలో పంటను విక్రయించుకోవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సమీప జిన్నింగ్ మిల్లులో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 8–12% తేమ ఉన్న పత్తికి రూ.8110–7786 మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. స్లాట్ రద్దును 24 గంటల ముందుగానే చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.