News November 26, 2024
ఒకే రోజున అక్కినేని హీరోల పెళ్లి?

టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ జైనాబ్ రవ్‌డ్జీతో ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 4న అఖిల్ సోదరుడు నాగచైతన్య-శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుండగా, అఖిల్‌ది కూడా అదేరోజున అదే వేదికపై జరుగుతుందా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ నిజంగా అక్కినేని వారసుల వివాహాలు ఒకేరోజున, ఒకే వేదికపై జరిగితే ఫ్యాన్స్‌కు కనుల పండుగే.
Similar News
News July 5, 2025
కరుణ్ ‘ONE MORE’ ఛాన్స్ ముగిసినట్లేనా?

టీమ్ ఇండియా ప్లేయర్ కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జట్టులో ఇతర సభ్యులను కాదని అతడిని ఆడిస్తే మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత టెస్టుల్లోకి వచ్చిన కరుణ్ బాధ్యతారహితంగా ఆడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో టెస్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.
News July 5, 2025
దోమల నివారణకు ఇలా చేయండి

TG: వర్షాకాలంలో దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇంటి పరిసరాల్లో నీరు నిలువకుండా చూసుకోవాలి. వాటర్ ట్యాంకులు మూతలు పెట్టి ఉంచాలి. పూల కుండీల కింద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వాడకంలోలేని టైర్లు, పనిముట్లు బహిరంగ ప్రదేశాల్లో ఉంచొద్దు. వీటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా రాకుండా నివారించవచ్చని పేర్కొంది.
News July 5, 2025
తల్లిదండ్రులకు పోలీసుల సూచన!

పిల్లలు ఇంటి నుంచి తరగతి గదికి చేరే వరకూ సురక్షితంగా వెళ్తున్నారా? లేదా? అనేది చూసుకునే బాధ్యత తల్లిదండ్రులు & బస్సు డ్రైవర్లపై ఉందని పోలీసులు తెలిపారు. ‘స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా? నైపుణ్యం కలిగిన డ్రైవరేనా? పికప్, డ్రాప్ టైమ్‌ను పాటిస్తున్నారా? లేదో గమనించాలి. స్కూల్ యాజమాన్యాలు బస్సుల్లో ఎమర్జెన్సీ నంబర్లను రాసి ఉంచాలి’ అని ట్వీట్ చేశారు.