News November 26, 2024
ARJUN TENDULKAR: 9.30 గంటలకు అన్‌సోల్డ్.. 10.30 గంటలకు సోల్డ్
ఐపీఎల్ వేలంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తొలుత అన్‌సోల్డ్‌గా మిగిలారు. గంట వ్యవధిలోనే మళ్లీ ఆయన పేరు వేలంలో ప్రత్యక్షమైంది. వెంటనే ముంబై ఇండియన్స్ ఆయనను బేస్ ప్రైస్ రూ.30 లక్షలకు తీసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ బిడ్ వెనుక ఏదో జరిగిందని కామెంట్లు పెడుతున్నారు. ఏం జరిగి ఉంటుందో కామెంట్ చేయండి.
Similar News
News November 26, 2024
వారి విషయంలో క్రియేటివ్‌గా ఆలోచించండి.. కేంద్రానికి సుప్రీం సూచన
విమానాల్లో అతిగా ప్రవర్తించే ప్రయాణికుల కట్టడికి క్రియేటివ్‌గా ఆలోచించి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం, విమానయాన శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022లో ఓ వ్యక్తి మద్యం మత్తులో తనపై యూరినేట్ చేశాడని 73 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను మెరుగుపరిచేలా ఆయా శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
News November 26, 2024
ఇండియా-ఏ ప్రాక్టీస్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే..
పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా విక్టరీ జోష్‌లో ఉన్న భారత అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఈ నెల 30న కాన్‌బెరాలో ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్‌తో ఇండియా-ఏ ఆడే 2రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను కూడా లైవ్ చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్‌లో ఇది టెలికాస్ట్ కానుంది. తొలి మ్యాచ్‌కి దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్‌కు రెండో టెస్టు ముంగిట ఈ ప్రాక్టీస్ కీలకం. రెండో టెస్టు వచ్చే నెల 6న అడిలైడ్‌లో ప్రారంభం కానుంది.
News November 26, 2024
వాలంటీర్ హత్య కేసు.. మాజీ మంత్రి కుమారుడికి బెయిల్
AP: వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌కు అమలాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా దుర్గాప్రసాద్ హత్య కేసు కోనసీమ జిల్లాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడిని శ్రీకాంతే హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. దీంతో గత నెల 23న కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.