News November 26, 2024

అఖిల్‌తో నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్ రవ్‌డ్జీ?

image

టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని జైనాబ్ రవ్‌డ్జీ అనే యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. కాగా ఆమె ఎవరని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. కాగా ఆమె ఆర్టిస్ట్ అని వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియా అకౌంట్లను ఆమె ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. ఇండియాతో పాటు దుబాయ్, లండన్‌లో పెరిగినట్లు సమాచారం. ఆమె తండ్రి జుల్ఫీ రవ్‌డ్జీ బిజినెస్‌మ్యాన్. 27ఏళ్ల జైనాబ్‌తో అఖిల్ ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 11, 2025

త్వరలో 900 అంగన్వాడీలు ప్రారంభం: మంత్రి సంధ్యారాణి

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండుమూడు నెలల్లో 900 అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీల్లో తాగునీరు, టాయిలెట్స్ కోసం రూ.7 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అలాగే గిరిజనుల కోసం 18 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని బడ్జెట్ ఆమోదం కోసం జరిగిన చర్చలో వివరించారు. మరోవైపు మహిళల సాధికారత TDPతోనే ప్రారంభమైందని వివరించారు.

News March 11, 2025

IPL: లక్నోకు బిగ్ షాక్!

image

ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఈ సీజన్ ఫస్టాఫ్‌కు అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్‌లో అదరగొట్టడంతో మెగా వేలంలో రూ.11 కోట్లు చెల్లించి మయాంక్‌ను LSG రిటైన్ చేసుకుంది. 150kmph వేగంతో బంతులు వేయడం మయాంక్ ప్రత్యేకత. కాగా మార్చి 24న లక్నో తన తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

News March 11, 2025

18 సీజన్లు.. ఒక్కడే కింగ్: RCB

image

విరాట్ కోహ్లీని 2008లో సరిగ్గా ఇదే రోజున IPL ఆక్షన్‌లో కొనుగోలు చేసినట్లు RCB ట్వీట్ చేసింది. ‘U19 ప్లేయర్ డ్రాఫ్ట్ నుంచి ఈ టాలెంటెడ్ బాయ్‌ను తీసుకున్నాం. 18yrs తర్వాత కూడా ఈ గేమ్‌కు అతడే కింగ్. ఇది చాలా గొప్ప ప్రయాణం. థాంక్యూ విరాట్. 18 సీజన్లు, 1 టీమ్, 1 కాన్‌స్టాంట్ కింగ్’ అని ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని RCB ఈసారైనా ఛాంపియన్‌గా నిలుస్తుందేమో చూడాలి.

error: Content is protected !!