News November 26, 2024
డాక్టర్ చైనాలో.. ఆపరేషన్ మొరాకోలో!
చైనాకు, మొరాకోకు 12వేల కిలోమీటర్ల దూరం. కానీ చైనాలోని షాంఘైలో ఉన్న వైద్యుడు మొరాకోలో ఉన్న రోగికి రోబోటిక్ విధానంలో ప్రోస్టేట్ క్యాన్సర్ సర్జరీని ఈ నెల 16న నిర్వహించారు. ఇంత దూరం నుంచి రిమోట్ సర్జరీ చేసిన తొలి వైద్యుడిగా రికార్డుకెక్కారు. దీనికోసం టౌమాయ్ రోబోట్‌ను, అత్యాధునిక సాంకేతికతను వాడినట్లు ఆయన వెల్లడించారు. కేవలం రెండు గంటల్లోనే ఆపరేషన్ ముగిసిందని, రోగి కోలుకుంటున్నారని తెలిపారు.
Similar News
News November 27, 2024
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా?
బరువు తగ్గడం అంత తేలిక కాదు. కానీ సరైన డైట్, జీవనశైలి పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్‌డ్, ప్యాకేజ్డ్, షుగర్ పదార్థాలకు దూరంగా ఉండాలి. కాఫీ, టీలు మానేయాలి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. ఒకపూట పూర్తిగా ఉడికించిన కూరగాయలు తినాలి. రాత్రి 7 గంటలలోపే డిన్నర్ ముగించాలి. సమృద్ధిగా నీరు తాగాలి. వీలైనంత ఎక్కువసేపు వ్యాయామం చేయాలి. రాత్రి 9 గంటలలోపే నిద్రించాలి.
News November 27, 2024
రెమ్యునరేషన్‌లో ‘పుష్పరాజ్’ ఆలిండియా టాప్!
2024లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలతో టాప్10 లిస్టును ఫోర్బ్స్ ఇండియా రిలీజ్ చేసింది. అందరికంటే ఎక్కువగా అల్లు అర్జున్(పుష్ప 2కి) ₹300 తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత విజయ్(₹275Cr) ఆ తర్వాత షారుఖ్(₹200Cr). రజనీకాంత్(₹270Cr), ఆమిర్ ఖాన్(₹275Cr), ప్రభాస్(₹200Cr), అజిత్(₹165Cr), సల్మాన్ ఖాన్(₹150Cr), కమల్ హాసన్ (₹150Cr), అక్షయ్ కుమార్(₹145Cr) గరిష్ఠంగా తీసుకున్నట్లు వెల్లడించింది.
News November 27, 2024
నవంబర్ 27: చరిత్రలో ఈ రోజు
1888: లోక్‌సభ మొదటి స్పీకర్ జి.వి.మావలాంకర్ జననం
1940: మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్ లీ జననం
1953: హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరి జననం
1975: నటి, మోడల్, రచయిత్రి సుచిత్రా కృష్ణమూర్తి జననం
1975: రేలంగి వెంకట్రామయ్య మరణం
1986: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా జననం(ఫొటోలో)
2008: భారత మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ మరణం