News November 26, 2024

30న మహబూబ్‌నగర్‌లో రైతు పండుగ: రేవంత్

image

TG: రైతుల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ, మద్దతు ధర, బోనస్ చెల్లించిన సందర్భంగా ఈ నెల 30వ తేదీన మహబూబ్‌నగర్‌లో రైతు పండుగను నిర్వహించనున్నట్లు CM రేవంత్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని 28, 29, 30 తేదీల్లో వ్యవసాయ ఎగ్జిబిషన్, ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, ఆదర్శ రైతులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్లంతా రైతు పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CM కోరారు.

Similar News

News November 27, 2024

వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా?

image

బరువు తగ్గడం అంత తేలిక కాదు. కానీ సరైన డైట్, జీవనశైలి పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్‌డ్, ప్యాకేజ్డ్, షుగర్ పదార్థాలకు దూరంగా ఉండాలి. కాఫీ, టీలు మానేయాలి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. ఒకపూట పూర్తిగా ఉడికించిన కూరగాయలు తినాలి. రాత్రి 7 గంటలలోపే డిన్నర్ ముగించాలి. సమృద్ధిగా నీరు తాగాలి. వీలైనంత ఎక్కువసేపు వ్యాయామం చేయాలి. రాత్రి 9 గంటలలోపే నిద్రించాలి.

News November 27, 2024

రెమ్యునరేషన్‌లో ‘పుష్పరాజ్’ ఆలిండియా టాప్!

image

2024లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోలతో టాప్10 లిస్టును ఫోర్బ్స్ ఇండియా రిలీజ్ చేసింది. అందరికంటే ఎక్కువగా అల్లు అర్జున్(పుష్ప 2కి) ₹300 తీసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత విజయ్(₹275Cr) ఆ తర్వాత షారుఖ్(₹200Cr). రజనీకాంత్(₹270Cr), ఆమిర్ ఖాన్(₹275Cr), ప్రభాస్(₹200Cr), అజిత్(₹165Cr), సల్మాన్ ఖాన్(₹150Cr), కమల్ హాసన్ (₹150Cr), అక్షయ్ కుమార్(₹145Cr) గరిష్ఠంగా తీసుకున్నట్లు వెల్లడించింది.

News November 27, 2024

నవంబర్ 27: చరిత్రలో ఈ రోజు

image

1888: లోక్‌సభ మొదటి స్పీకర్ జి.వి.మావలాంకర్ జననం
1940: మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్ లీ జననం
1953: హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరి జననం
1975: నటి, మోడల్, రచయిత్రి సుచిత్రా కృష్ణమూర్తి జననం
1975: రేలంగి వెంకట్రామయ్య మరణం
1986: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా జననం(ఫొటోలో)
2008: భారత మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ మరణం