News November 27, 2024
EVMలు ట్యాంపరింగ్ అవ్వవు: కలెక్టర్

ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) ట్యాంపరింగ్ అవ్వవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ మరోసారి స్పష్టం చేశారు. భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసిందని తెలిపారు.
Similar News
News January 31, 2026
రంగారెడ్డి: అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్

ఈ నెల 15న వరుసగా ఇళ్లల్లో చోరీలు చేసి పరారైన అంతరాష్ట్ర దొంగలను శుక్రవారం మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు DCP సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన మహాదేవ్ ఝా (A-1), పవన్ గుప్తా (A-2), కాన్పూర్‌కు చెందిన మంగళ్ సింగ్ (A-3)లు బోడుప్పల్ పరిధిలోని 9 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 250 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, రూ.2 లక్షల నగదును దోచుకొని పరారైనట్లు తెలిపారు.
News January 31, 2026
రంగారెడ్డి: అత్యాచారం ఘటనలో 25 సంవత్సరాల జైలు

బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 25 సంవత్సరాలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఇన్‌స్పెక్టర్ సైదులు వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ హబీబ్ (53) 2023లో బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో 25 సంవత్సరాలు జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు.
News January 31, 2026
రంగారెడ్డి: ఉరేసుకుని సాప్ట్ వేర్ సూసైడ్

ఓ సాప్ట్ వేర్ ఇంజినీరు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరల మేరకు.. వంశీ యాదవ్ (38) భార్య శ్రావ్య, ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి దుర్గాహిల్స్‌లో కాపురముంటున్నాడు ఉంటున్నారు. ఈ క్రమంలో కుంటుంబంలో కలహాలు ఏర్పాడ్డాయి. మనస్తాపం చెందిన అతను శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


