News November 27, 2024

నెల్లూరు మెడికల్ కాలేజీకి కొత్తగా 9 పీజీ మెడికల్ సీట్లు

image

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి 9 పీజీ సీట్లను కేంద్ర వైద్యారోగ్య శాఖ  కేటాయించింది. 2024- 25 సంవత్సరానికి గాను ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ విభాగాల్లో ఈ సీట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నెల్లూరు మెడికల్‌ కళాశాలకు సమాచారం అందించింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషి వల్లే ఇది సాధ్యమైనందని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 19, 2026

నెల్లూరు: నేడు పాఠశాలలు ప్రారంభం

image

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లావ్యాప్తంగా నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులతో స్కూల్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఉపాధ్యాయులు హాజరై తరగతులు నిర్వహించారు. సెలవుల తరువాత మళ్లీ చదువుల వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం కనిపించింది. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపుతూ హర్షం వ్యక్తం చేశారు.

News January 19, 2026

నెల్లూరు: 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు జిల్లాలో 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు జనవరి 21, 22వ తేదీలలో తిరుపతి జిల్లా అలిపిరి రోడ్డులోని DMHO కార్యాలయం నందు హాజరుకావాలని సూచించారు.

News January 19, 2026

నెల్లూరు: ఇరిగేషన్లో రూ.100 కోట్లు పక్కదారి!

image

మొంథా తుఫాను నిధులు పక్కదారి పట్టాయి. జిల్లాకు రూ.100 కోట్లు మంజూరైతే.. పనులు చేయకుండానే బిల్లులు పెట్టేశారు. ఈ వ్యవహారంలో ఓ DAO తన కొడుకు, బంధువుల ఫోన్ పేకి అమౌంట్ ట్రాన్సఫర్ చేయించుకోవడంతో అవినీతి బట్ట బయలైంది. ఈ విషయం రాష్ట్రస్థాయికి చేరడంతో విచారణ అధికారి వచ్చి వెళ్లారు కానీ ఫైళ్లు ముందుకు కదలలేదు. తుఫానుతో చెరువులు కరకట్లు, షట్టర్లు, కాలువల మరమ్మతుల చేపట్టిన దాఖలాలు లేవు.