News November 27, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 15, 2026

మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్

image

TG: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్‌చిట్ ఇచ్చారు. వారు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. కాగా గత నెలలో ఫిరాయింపులకు సరైన ఆధారాల్లేవని <<18592868>>ఐదుగురు<<>> MLAలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, సంజయ్ తమ అనర్హతపై ఇంకా స్పీకర్‌కు వివరణ ఇచ్చుకోలేదు.

News January 15, 2026

ఉసిరి నూనెతో ఒత్తైన జుట్టు

image

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

News January 15, 2026

NI-MSMEలో ఉద్యోగాలు

image

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(NI-MSME) 2 కన్సల్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ, BCom,MCom,CA,CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ మెయిల్ recruitment@nimsme.gov.in ద్వారా అభ్యర్థులు జనవరి 30 వరకు అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.nimsme.gov.in/