News November 27, 2024
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా?
బరువు తగ్గడం అంత తేలిక కాదు. కానీ సరైన డైట్, జీవనశైలి పాటిస్తే త్వరగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్‌డ్, ప్యాకేజ్డ్, షుగర్ పదార్థాలకు దూరంగా ఉండాలి. కాఫీ, టీలు మానేయాలి. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు తీసుకోవాలి. ఒకపూట పూర్తిగా ఉడికించిన కూరగాయలు తినాలి. రాత్రి 7 గంటలలోపే డిన్నర్ ముగించాలి. సమృద్ధిగా నీరు తాగాలి. వీలైనంత ఎక్కువసేపు వ్యాయామం చేయాలి. రాత్రి 9 గంటలలోపే నిద్రించాలి.
Similar News
News November 27, 2024
ఆర్టీసీ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
TG: మాజీ సైనికులను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు 1,201 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
News November 27, 2024
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 85% బోనస్!
తమ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్‌తో ముగిసిన Q2కి మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పర్ఫార్మెన్స్ బోనస్ ప్రకటించింది. ఇది వారి జీతంలో 85% ఉన్నట్లు సమాచారం. నవంబర్ నెల జీతంతో పాటు దీన్ని చెల్లించనుంది. డెలివరీ అండ్ సేల్స్ విభాగంలోని జూనియర్, మిడ్ లెవల్ ఉద్యోగులకు బోనస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చే జనవరి నుంచి జీతాలు పెంచనున్నట్లు తెలుస్తోంది.
News November 27, 2024
తుఫాన్ ముప్పు: 2 రోజులు సెలవులు ఇవ్వాలని వినతి
AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న ‘ఫెంగల్’ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో నవంబర్ 29, 30న విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని ఏపీ వెదర్‌మ్యాన్ కోరారు. అలాగే నవంబర్ 30న అన్ని కోస్తాంధ్ర జిల్లాల్లో హాలిడే ఇవ్వాలన్నారు. డిసెంబర్ 3 వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.